ఇవాళ మార్కెట్లపై ప్రభావం చూపే అంశాలివే - June 22

2022-06-22 08:24:00 By Marepally Krishna

img

ఇవాళ దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం కావచ్చని సూచిస్తోన్న ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

50 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడవుతోన్న ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

నిక్కాయ్‌, జకార్తా మినహా నష్టాల్లో ఆసియా మార్కెట్లు

ఒకటిన్నర శాతం పైగా నష్టంతో కోస్పి, తైవాన్‌ ఇండెక్స్‌లు

భారీ లాభాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు, రెండున్నర శాతం పైగా లాభపడిన నాస్‌డాక్‌

మరింత తగ్గిన క్రూడాయిల్‌ ధర, 3శాతం పైగా క్షీణతతో 111 డాలర్లుగా ఉన్న బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 

వచ్చేనెల్లో అమెరికాలో వడ్డీరేట్లు పెరగనున్నాయనే వార్తలతో మరింత తగ్గిన బంగారం ధర

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ 1827.90 డాలర్లు

క్రితం ట్రేడింగ్‌ సెషన్‌లో రూ.2701.21 కోట్ల షేర్లను విక్రయించిన ఎఫ్‌ఐఐలు

మంగళవారం ట్రేడింగ్‌లో రూ.3066.41 కోట్ల షేర్లను కొనుగోలు చేసిన డీఐఐలు


bse nse stock market bull bear loss profit trading Telugu News