బడా కంపెనీల మార్కెట్ క్యాప్‌ తగ్గింది.. అయినా తన టైటిల్‌ను నిలబెట్టుకున్న రిలయన్స్

2021-10-24 15:00:59 By VANI

img

మార్కెట్‌లో టాప్-10 అత్యంత విలువైన కంపెనీల్లో ఐదు బడా కంపెనీల మార్కెట్ క్యాప్ తగ్గిపోయింది. దీంతో వాటి సంయుక్త మార్కెట్ విలువ గత వారం రూ.1,42,880.11 కోట్ల మేర క్షీణించింది. హిందుస్థాన్ యూనిలీవర్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రధానంగా వెనుకబడ్డాయి. 

 

గత వారం బీఎస్ఈ బెంచ్ మార్క్ సెన్సెక్స్ 484.33 పాయింట్లు లేదా 0.79 శాతం క్షీణించింది. మార్కెట్ బెంచ్‌మార్క్‌లు - సెన్సెక్స్, నిఫ్టీ - శుక్రవారం వరుసగా నాల్గవ సెషన్ కోసం క్షీణించాయి. బీఎస్ఈ-లిస్టెడ్ సంస్థల M-క్యాప్ రికార్డు గరిష్ట స్థాయి రూ.270.73 లక్షల కోట్లు. BSE- లిస్టెడ్ సంస్థల మార్కెట్ కేపిటలైజేషన్M-cap రికార్డు స్థాయిలో అత్యధికంగా 270.73 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) యొక్క మార్కెట్ వాల్యుయేషన్, 45,523.33 కోట్లు తగ్గి 5,76,836.40 కోట్లకు చేరుకుంది. 

 

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) విలువ రూ.45,126.6 కోట్లు తగ్గి రూ.16,66,427.95 కోట్లకు చేరింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మార్కెట్ విలువ ₹41,151.94 కోట్లు తగ్గి ₹12,94,686.48 కోట్లకు చేరింది. బజాజ్ ఫైనాన్స్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,890.95 కోట్లు తగ్గి రూ 4,65,576.46 కోట్లకు పడిపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్ రూ.2,187.29 కోట్లు తగ్గి, 9,31,371.72 కోట్లకు పడిపోయింది.

 

ఇక కోటక్ మహీంద్రా బ్యాంక్ మాత్రం రూ.30,747.78 కోట్లు పెరిగి 4,30,558.09 కోట్లకు చేరింది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.22,248.14 కోట్లు పెరిగి రూ.5,26,497.27 కోట్లకు చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ విలువ రూ.17,015.22 కోట్లు పెరిగి రూ.5,24,877.06 కోట్లకు చేరగా.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.11,111.14 కోట్లు లాభపడి రూ.4,48,863.34 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిన్ విలువ రూ.1,717.96 పెరిగి రూ.7,29,410.37 కోట్లకు చేరింది. 

 

ఇక మార్కెట్ విలువ ఆధారంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధిక విలువైన కంపెనీ టైటిల్‌ను నిలుపుకుంది. టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్, యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.


Reliance Industries Limited  TCS  HDFC Bank  Infosys  HUL  ICICI Bank  HDFC  Bajaj Finance  State Bank of India  Kotak Mahindra Bank

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending