నెలరోజుల్లో 101శాతం పెరిగింది ఈ స్మాల్ క్యాప్ ఫార్మా స్టాక్

2021-05-03 23:27:48 By Y Kalyani

img

నెలరోజుల్లో 101శాతం పెరిగింది ఈ స్మాల్ క్యాప్ ఫార్మా స్టాక్

Morepen లాబొరేటరీస్ షేర్లు సోమవారం 5 శాతం అప్పర్ సర్క్యూట్లో రూ .68.65 వద్ద లాక్ అయ్యాయి. మార్కెట్లో 19 సంవత్సరాల గరిష్టాన్ని తాకింది. 2002లో ఈ ఫార్మాకంపెనీ స్టాక్ అత్యధిక స్థాయిలో ట్రేడవుతోంది. గడిచిన నెలరోజుల్లో Morepen లాబొరేటరీస్ స్టాక్ మార్కెట్ ధర 101 శాతం జూమ్ అయ్యింది. ఇదే సమయానికి బిఎస్ఇ సెన్సెక్స్ 3 శాతం తగ్గింది. 

మోరపెన్ లాబొరేటరీస్ సుమారు 1,200 కోట్ల రూపాయల హెల్త్ కేర్ కంపెనీ. హిమాచల్ ప్రదేశ్ కేంద్రంగా ఉత్పత్తి యూనిట్లు కలిగి ఉంది. అమెరికా FDA మరియు యూరప్, ఇతర ఆసియా మరియు ఆస్ట్రేలియా దేశాల అప్రూవల్స్ తో ఉత్పత్తులను మార్కెట్ చేస్తోంది. మోరెపెన్ తయారుచేసే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడెంట్స్ యాంటీ-అలెర్జీ మరియు యాంటీ-ఆస్తమాటిక్ ఔషధాల్లో వాడుతున్నారు. ఈ విభాగంలో అతిపెద్ద తయారీదారుగా ఉంది కంపెనీ.
ఏప్రిల్ 28న స్విట్జర్లాండ్‌ కు చెందిన గ్లోబల్ ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ Corinth Group కంపెనీలో భారీగా ఇన్వెస్ట్ చేసింది. మోరెపెన్ లాబొరేటరీస్‌లో మొత్తం 750 కోట్లు పెట్టుబడి పెట్టడానికి అంగీకరించింది. 58.50 మిలియన్ ఈక్విటీ షేర్లను ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన కేటాయించారు. ఇది కంపెనీలో 9.41 శాతం ఈక్విటీ వాటాతో సమానం. 


market stocks dalalstreet bse nse

Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending