ఈ మిడ్ క్యాప్ స్టాక్ కొన్నవాళ్లకు గత ఏడాది కనకవర్షం

2021-07-21 22:56:51 By Y Kalyani

img

ఈ మిడ్ క్యాప్ స్టాక్ కొన్నవాళ్లకు గత ఏడాది కనకవర్షం

లక్కు కాదు.. దేవుడి దయ కాదు. ముందుచూపుతో మంచి కంపెనీ చూసుకుని బెస్ట్ ఇన్వెస్టర్ ప్లానర్ సలహా తీసుకుని మనీ పెడితే రూపాయి పదిరూపాయలు వస్తుంది. డబ్బు సంపాదిండానికి ఉన్న మంచి మార్గం స్టాక్ మార్కెట్. అవును.. ఎలా సంపాదించవచ్చే ఈ స్టాక్ చెబుతుంది. అదే  Mastek Limited.

స్టాక్ ఎంత పెరిగిందంటే...
మాస్టెక్ లిమిటెడ్ షేర్ సరిగ్గా ఏడాదిలో 440శాతం పెరిగింది. 2020 జూలై 22న ఈ షేరు యూనిట్ ధర 461.15 వద్ద ఉంది. మరి ఏడాది తిరిగే సరికి..రూ.2491 వద్ద ట్రేడ్ అవుతోంది. అంటే ఏ రేంజిలో పెరిగిందో చూడండి. ఈ కంపెనీ షేరుపై నమ్మి లక్ష రూపాయలు పెట్టినవాళ్లకు సంపద 6లక్షలు అయింది. ఇయర్ టే డేట్ చూస్తే కూడా 100శాతానికి పైగాగెయిన్ అయింది. జనవరి 1న రూ.1208 వద్ద ఉన్న స్టాక్ ప్రజంట్ 2491 వద్ద ఉంది. అంటే 106శాతం గెయిన్ అయింది. 6 నెలల్లో చూస్తే 123శాతం, నెలరోజుల్లో 12శాతం లాభపడింది. 
ఇటీవల హెల్తీ జూన్ త్రైమాసిక ఫలితాలను పోస్ట్ చేసిన తర్వాత ఈ స్టాక్ 4.3 శాతం పెరిగి బిఎస్ఇలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 2,600 రూపాయలకు చేరుకుంది. అయితే స్టాక్ మార్కెట్ అనిశ్చితి కారణంగా మళ్లీ స్వల్పంగా కరెక్షన్ వచ్చింది. రూ .6,300 కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో ఉన్న కంపెనీ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉందని అంటున్నారు నిపుణులు. 
 


Share of Mastek Limited mastek profit multi bagger