స్మాల్ క్యాప్ షేర్... బిగ్ ప్రాఫిట్

2021-11-25 22:43:21 By Y Kalyani

img

స్మాల్ క్యాప్ షేర్... బిగ్ ప్రాఫిట్
12 నెలల్లో డబుల్ అయిన స్టాక్

చిన్న స్టాక్స్ అయినా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటే భారీగా ప్రాఫిట్ ఇస్తాయి. చాలా కంపెనీలు మంచి పనితీరుతో లాభదాయకంగా మారి షేర్ హోల్డర్స్ కు కాసులు కురిపిస్తున్నాయి. మంచి త్రైమాసిక ఫలితాలు ఉంటే.. షేరు కూడా పెరుగుతుంది. అలాంటి కంపెనీయే ఏకంగా ఏడాదిలో ఇన్వెస్టర్ల డబ్బును డబుల్ చేసింది. 
NRB బేరింగ్స్ లిమిటెడ్ షేర్లు గత 12 నెలల్లో పెట్టుబడిదారుల డబ్బును రెట్టింపు చేశాయి. రూ.75.7 మార్క్ నుంచి ఏకంగా రూ.173.7కి చేరుకుంది. స్మాల్ క్యాప్ స్టాక్ గత ఏడాదిలో 129 శాతం లాభపడింది ఈ కేలండర్ ఇయర్ లో అయితే 69.5 శాతం పెరిగింది. రూ. 1,600 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ సొంతం చేసుకుంది.  
భారతదేశంలో రోలర్ బేరింగ్‌ల  అతిపెద్ద తయారీదారు సంస్థ ఇది. సెప్టెంబర్ 2021తో ముగిసిన త్రైమాసికంలో దాని నికర లాభం సంవత్సరానికి (YoY) 143 శాతం పెరిగింది. మొత్తం రూ. 22.57 కోట్లకు చేరుకుంది. క్రితం సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ. 9.28 కోట్లుగా ఉంది. సెప్టెంబర్ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా ఆదాయం 30 శాతం వృద్ధి చెంది రూ.242.8 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు సంవత్సరంలో రూ. 186 కోట్లుగా ఉంది. 
బలమైన R&D, BS VI నిబంధనలు మరియు ఇ-మొబిలిటీ ట్రెండ్‌ని తగ్గట్టుగా కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో ముందుంది. ఆర్డర్ పుస్తకం ఫుల్లుగా ఉంది. విదేశాలకు ఎగుమతులు కూడా భారీగా ఉన్నాయి. అనుబంధ సంస్థల ఎగుమతుల్లో గణనీయమైన మరియు నిరంతర వృద్ధి కంపెనీ నమోదు చేస్తోంది. 
గత 4 వరుస త్రైమాసికాల్లో సానుకూల ఫలితాలను ప్రకటించింది కంపెనీ. స్టాక్ సాంకేతికంగా బుల్లిష్ పరిధిలో ఉంది. అలాగే, స్టాక్ దాని సగటు హిస్టారికల్ వాల్యుయేషన్‌లతో పోలిస్తే డౌన్ లో ట్రేడవుతోంది. ఆకర్షణీయమైన వాల్యుయేషన్‌ను కలిగి ఉంది కాబట్టి ఇంకాపెరిగే అవకాశం ఉంది. 


share multibagger stock trading

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending