FY21లో ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ డబుల్ చేసిన షేర్లు ఇవే

2021-05-04 22:13:48 By Y Kalyani

img

FY21లో ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ డబుల్ చేసిన షేర్లు ఇవే

ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్స్ FPIలు దేశీయ స్టాక్ మార్కెట్లో భారీగా ఇన్వెస్ట్ చేశారు. గడిచిననాలుగు త్రైమాసికాల్లో మార్కెట్ల ర్యాలీలో కీలకపాత్ర పోషించారు. మన మార్కెట్లో 2020-21 ఆర్ధిక సంవత్సరంలో 2లక్షల 70వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. మరీ ముఖ్యంగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో ఫోకస్ చేశారు. FIIల దన్నుతో ఈ స్టాక్స్ పరుగులు తీశాయి. 1000 కోట్ల టర్నొవర్ ఉన్న ఓ 17 కంపెనీలు అయితే ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించాయి. స్టాక్స్ 100 నుంచి 1000శాతం వరకూ పెరిగాయి. 
 

100శాతానికి పైరిగిన స్టాక్స్..
Intelect Design  1194శాతం పెరిగింది. మార్కెట్ క్యాప్ 9వేల 400 కోట్లు దాటింది.
IG పెట్రో కెమికల్స్ 383.48శాతం పెరిగింది. కంపెనీ టర్నొవర్ 1378 కోట్లుగా ఉంది.
బజాజ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 324.6శాతం గెయిన్ అయింది.
ఇండియామార్ట్ కంపెనీ స్టాక్ 312 శాతానికి పైగా గెయిన్ అయింది.
ట్యూబ్ ఇన్వెస్ట్ మెంట్ ఆఫ్ ఇండియా 309శాతం పెరిగింది.
Elgi ఎక్విప్మెంట్  305శాతం వరకూ పెరిగింది.
జేకే సిమెంట్ కంపెనీ షేరు 204 శాతం పెరిగింది.
పాలీ ప్లెక్స్ కార్పొరేషన్ కంపెనీ స్టాక్ 191శాతం గెయిన్ అయింది.
లార్సన్ అండ్ టూబ్రో ఇన్ఫోటెక్ షేరు ఏడాదిలో 170శాతం వరకు లాభాలు పంచింది.
కమిన్స్ ఇండియా 163శాతం లాభపడగా.. Sasken టెక్నాలజీస్ 157శాతం గెయిన్ అయింది.
భారత్ ఫోర్జ్ 151శాతం.. గుజరాత్ అంబూజా ఎక్స్ పోర్ట్స్ 148శాతం.. మైండ్ ట్రీ 145శాతం.. గర్వార్ టెక్నికల్ 138శాతం, KEC ఇంటర్నేషనల్ 7120శాతం, JTEKTకంపెనీ స్టాక్ 101శాతం లాభపడ్డాయి. 
 


Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending