-->

బడ్జెట్‌ తర్వాత ఈ స్టాక్స్‌లోనే ర్యాలీ ఎందుకో తెలుసా?

2021-01-13 14:39:19

img

ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టే బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే గత కొన్నేళ్ళుగా బడ్జెట్‌ తర్వాత కొన్ని స్టాక్స్‌ పెర్ఫామన్స్‌ మెరుగ్గా ఉండటంతో ఈ ఏడాది కూడా ఆయా స్టాక్స్‌పై అంచనాలు మరింత పెరిగాయి. రూ.వెయ్యి కోట్లకు పైగా మార్కెట్‌ క్యాప్ ఉన్న కంపెనీల్లో చూస్తే గత నాలుగేళ్ళుగా ఒక బడ్జెట్‌ నుంచి మరో బడ్జెట్‌ వరకు ఓ 11 స్టాక్స్‌ మాత్రం కనీసం 25శాతం లాభపడ్డాయి. గత ఏడాది ఈ 11 స్టాక్స్‌ మాత్రం 180-640 శాతం మధ్య పెరిగాయి. ఆ కంపెనీల వివరాలు దిగువ ఉన్నాయి.


Procter & Gamble Health : 2017 బడ్జెట్‌ తర్వాత ఈ స్టాక్స్‌లో చక్కని ర్యాలీ కనిపిస్తోంది. 2018 బడ్జెట్‌ వరకు 56శాతం, 2018 బడ్జెట్‌ నుంచి 2019 బడ్జెట్‌ వరకు 125శాతం, 2019 బడ్జెట్‌ నుంచి 2020 బడ్జెట్‌ వరకు 32శాతం, గత ఏడాది బడ్జెట్‌ నుంచి ఇప్పటివరకు 60శాతం లాభపడి ఇన్వెస్టర్లను మురిపించాయి. ఓవరాల్‌గా చూస్తే 2017లో రూ.950 వద్ద కదలాడిన షేర్‌ ప్రస్తుతం 644శాతం పెరిగి రూ.6965.60కు ఎగబాకింది.


GMM Pfaudler : బడ్జెట్‌ తర్వాత ఈ స్టాక్స్‌లో కూడా చక్కని ర్యాలీ కొనసాగుతోంది. 2017 బడ్జెట్‌ నుంచి 2018 బడ్జెట్‌ వరకు 35శాతం, 2018 బడ్జెట్‌ నుంచి 2019 బడ్జెట్‌ వరకు 53శాతం, 2019 బడ్జెట్‌ నుంచి 2020 బడ్జెట్‌ వరకు 123శాతం, గత ఏడాది బడ్జెట్‌ నుంచి ఇప్పటివరకు 57శాతం లాభపడ్డాయి. ఓవరాల్‌గా చూస్తూ ఫిబ్రవరి 1, 2017 వరకు షేర్‌ ధర 620 శాతం పెరిగి రూ.3861.10కు చేరింది.


Coforge : 2017 బడ్జెట్‌ నుంచి 2018 బడ్జెట్‌ వరకు 105శాతం, 2018 బడ్జెట్‌ నుంచి 2019 బడ్జెట్‌ వరకు 57శాతం, 2019 బడ్జెట్‌ నుంచి 2020 బడ్జెట్‌ వరకు 42శాతం, గత ఏడాది బడ్జెట్‌ నుంచి ఇప్పటివరకు 50శాతం లాభపడ్డాయి. ఓవరాల్‌గా చూస్తూ 2017 బడ్జెట్‌ నుంచి ఇప్పటి వరకు షేర్‌ ధర 589 శాతం వృద్ధితో రూ.2815.40కు పెరిగింది.


Jubilant FoodWorks : ఈ కంపెనీ స్టాక్‌ పెర్ఫామెన్స్‌ను ఒకసారి పరిశీలిస్తే 2017 బడ్జెట్‌ నుంచి 2018 బడ్జెట్‌ వరకు 132శాతం, 2018 బడ్జెట్‌ నుంచి 2019 బడ్జెట్‌ వరకు 32శాతం, 2019 బడ్జెట్‌ నుంచి 2020 బడ్జెట్‌ వరకు 38శాతం, గత ఏడాది బడ్జెట్‌ నుంచి ఇప్పటివరకు 56శాతం లాభపడ్డాయి. 2017 ఫిబ్రవరి 1 నుంచి ఇప్పటివరకు ఈ స్టాక్‌ 564శాతం వృద్ధితో రూ.2933.40కు ఎగబాకింది.


Info Edge (India) : 2017 బడ్జెట్‌ నుంచి 2018 బడ్జెట్‌ వరకు 60శాతం, 2018 బడ్జెట్‌ నుంచి 2019 బడ్జెట్‌ వరకు 30శాతం, 2019 బడ్జెట్‌ నుంచి 2020 బడ్జెట్‌ వరకు 54శాతం, గత ఏడాది బడ్జెట్‌ నుంచి ఇప్పటివరకు 105శాతం ఈ స్టాక్‌ లాభపడింది. ఫిబ్రవరి 1, 2017 నుంచి జనవరి 11, 2021 మధ్య ఈ స్టాక్‌ 558శాతం రిటర్న్స్‌ అందించడంతో షేర్‌ ధర రూ.5476.90కు పెరిగింది.


Paushak : ఈ స్టాక్‌ పెర్ఫామెన్స్‌ విషయానికి వస్తే 2017 బడ్జెట్‌ నుంచి 2018 బడ్జెట్‌ వరకు 139 శాతం, 2018 బడ్జెట్‌ నుంచి 2019 బడ్జెట్‌ వరకు 50శాతం, 2019 బడ్జెట్‌ నుంచి 2020 బడ్జెట్‌ వరకు 33శాతం, గత ఏడాది బడ్జెట్‌ నుంచి ఇప్పటివరకు 36శాతం ఈ స్టాక్‌ లాభపడింది. ఫిబ్రవరి 1, 2017 నుంచి జనవరి 11, 2021 మధ్య ఈ స్టాక్‌ 552శాతం రిటర్న్స్‌ అందించడంతో షేర్‌ ధర రూ.3815.05కు చేరింది.


Divis Laboratories : 2017 బడ్జెట్‌ నుంచి 2018 బడ్జెట్‌ వరకు 50శాతం, 2018 బడ్జెట్‌ నుంచి 2019 బడ్జెట్‌ వరకు 47శాతం, 2019 బడ్జెట్‌ నుంచి 2020 బడ్జెట్‌ వరకు 30శాతం, గత ఏడాది బడ్జెట్‌ నుంచి ఇప్పటివరకు 92శాతం ఈ స్టాక్‌ లాభపడింది. ఫిబ్రవరి 1, 2017 నుంచి జనవరి 11, 2021 మధ్య ఈ స్టాక్‌ 451శాతం రిటర్న్స్‌ అందించడంతో షేర్‌ ధర రూ.3822.60కు పెరిగింది.


Astral Poly Technik : బడ్జెట్‌ తర్వాత ఈ స్టాక్స్‌లో కూడా చక్కని ర్యాలీ కొనసాగుతోంది. 2017 బడ్జెట్‌ నుంచి 2018 బడ్జెట్‌ వరకు 91శాతం, 2018 బడ్జెట్‌ నుంచి 2019 బడ్జెట్‌ వరకు 41శాతం, 2019 బడ్జెట్‌ నుంచి 2020 బడ్జెట్‌ వరకు 31శాతం, గత ఏడాది బడ్జెట్‌ నుంచి ఇప్పటివరకు 53శాతం పెరిగాయి. ఓవరాల్‌గా చూస్తూ ఫిబ్రవరి 1, 2017 వరకు షేర్‌ ధర 441 శాతం పెరిగి రూ.1787.15కు ఎగబాకింది.


Honeywell Automation : ఈ స్టాక్‌ పెర్ఫామెన్స్‌ విషయానికి వస్తే 2017 బడ్జెట్‌ నుంచి 2018 బడ్జెట్‌ వరకు 79 శాతం, 2018 బడ్జెట్‌ నుంచి 2019 బడ్జెట్‌ వరకు 27శాతం, 2019 బడ్జెట్‌ నుంచి 2020 బడ్జెట్‌ వరకు 29శాతం, గత ఏడాది బడ్జెట్‌ నుంచి ఇప్పటివరకు 45శాతం ఈ స్టాక్‌ లాభపడింది. ఫిబ్రవరి 1, 2017 నుంచి జనవరి 11, 2021 మధ్య ఈ స్టాక్‌ 327 శాతం రిటర్న్స్‌ అందించడంతో షేర్‌ ధర రూ.40425.60కు చేరింది.


Vinati Organics : 2017 బడ్జెట్‌ నుంచి 2018 బడ్జెట్‌ వరకు 28శాతం, 2018 బడ్జెట్‌ నుంచి 2019 బడ్జెట్‌ వరకు 65శాతం, 2019 బడ్జెట్‌ నుంచి 2020 బడ్జెట్‌ వరకు 26శాతం, గత ఏడాది బడ్జెట్‌ నుంచి ఇప్పటివరకు 31శాతం ఈ స్టాక్‌ లాభపడింది. ఫిబ్రవరి 1, 2017 నుంచి జనవరి 11, 2021 మధ్య ఈ స్టాక్‌ 250శాతం రిటర్న్స్‌ అందించడంతో షేర్‌ ధర రూ.1301.45కు పెరిగింది.


Pfizer : బడ్జెట్‌ తర్వాత ఈ స్టాక్స్‌లో కూడా చక్కని ర్యాలీ కొనసాగుతోంది. 2017 బడ్జెట్‌ నుంచి 2018 బడ్జెట్‌ వరకు 29 శాతం, 2018 బడ్జెట్‌ నుంచి 2019 బడ్జెట్‌ వరకు 31 శాతం, 2019 బడ్జెట్‌ నుంచి 2020 బడ్జెట్‌ వరకు 34శాతం, గత ఏడాది బడ్జెట్‌ నుంచి ఇప్పటివరకు 26శాతం పెరిగాయి. ఓవరాల్‌గా చూస్తూ ఫిబ్రవరి 1, 2017 వరకు షేర్‌ ధర 188 శాతం పెరిగి రూ.5148.90కు ఎగబాకింది.