ఒకే ఒక్క ప్రకటనతో 15 శాతం అప్పర్ సర్క్యూట్‌‌‌కి టాటా మోటార్స్ షేర్లు.. 

2021-10-13 12:07:33 By VANI

img

ఒకే ఒక్క ప్రకటనతో టాటా మోటార్స్ షేర్లు ఇరగదీశాయి. బుధవారం బీఎస్ఈలో ఇంట్రా డే ట్రేడ్‌లో 15 శాతం అప్పర్ సర్క్యూట్‌‌తో రూ.483.90కి చేరాయి. మార్కెట్ అవర్స్ తర్వాత మంగళవారం కంపెనీ తన ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారంలో 9.1 బిలియన్ డాలర్ల విలువ గల టీపీజీ రైజ్ క్లైమేట్ నుంచి రూ .7,500 కోట్లు ($ 1 బిలియన్) సమీకరించనున్నట్లు తెలిపింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ (F&O) విభాగంలో స్టాక్ ట్రేడ్ అవుతుంది దీనికి సర్క్యూట్ పరిమితులు లేవు.

 

టాటా మోటార్స్ డీవీఆర్ (డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్) షేర్లు ఈ రోజు బీఎస్ఈలో ఇంట్రా-డే ట్రేడ్‌లో 20 శాతం పెరిగి రూ.237.20కి చేరుకున్నాయి. టాటా మోటార్స్ (టీఎమ్‌ఎల్), టీపీజీ రైజ్ క్లైమేట్ ఒక బైండింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. తద్వారా టీపీజీ రైజ్ క్లైమేట్ దాని సహ పెట్టుబడిదారుడు ఎడిక్యూతో కలిసి కొత్తగా చేర్చబడే టాటా మోటార్స్ యొక్క అనుబంధ సంస్థలో పెట్టుబడి పెట్టాలని టాటా మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

 

టీపీజీ రైజ్ క్లైమేట్‌తో సహ పెట్టుబడిదారులతో పాటు ఈ కంపెనీలో 11 శాతం నుంచి 15 శాతం వాటాను పొందడానికి రూ.7,500 కోట్లు కంపల్సరీ కన్వర్టిబుల్ ఇన్‌స్ట్రుమెంట్‌లలో పెట్టుబడి పెట్టాలి. మార్చి 22 నాటికి మొదటి రౌండ్ కేపిటల్ ఇన్ఫ్యూషన్ పూర్తవుతుందని అలాగే 2022 చివరి నాటికి మొత్తం నిధులు ఇన్‌ఫ్యూజ్ అవుతాయని భావిస్తున్నారు. 


Tata Motors  BSE  Futurs and Options  Tata Motors DVR

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending