స్టాక్ మార్కెట్లో నష్టాలు గంట గంటకీ ఎక్కువ అయ్యాయ్. సెన్సెక్స్ 892 పాయింట్లు క్రాష్ అయింది. దీంతో లార్జ్ క్యాప్ సహా అన్ని రకాల సంస్థల షేర్లకి నష్టాలు తప్పడం లేదు. వరసగా ఇది ఐదో నష్టాల సెషన్ కావడంతో ఇక ప్రాఫిట్ బుకింగ్‌తో పాటు ప్యానిక్ సెల్లింగ్ కూడా
కాస్త కన్పిస్తోంది.నిఫ్టీ 219 పాయింట్లు నష్టపోయి,14762 పాయింట్ల వద్ద, సెన్సెక్స్ 892 పాయింట్లు నష్టపోయి 50,061 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది( కథనం ప్రచురించే సమయానికి)
గత వారం లాభాల్లో ట్రేడైన స్టాక్స్ ఇవాళ్టి ట్రేడింగ్‌లో పదిశాతం వరకూ నష్టపోయాయ్. వాటిలో సెంట్రల్ బ్యాంక్ ఆప్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ముందు ఉఁడగా..బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 8.78శాతం నష్టపోయింది. ఐటీ స్టాక్స్‌లోనూ అమ్మకాల ఒత్తిడి క్లియర్‌గా కన్పిస్తోంది. ఏ స్టాక్ ఎలా నష్టపోయిందో కింది స్నాప్ షాట్స్‌లో చూడండి