కొనసాగుతోన్న బుల్‌ రంకెలు, సరికొత్త గరిష్టానికి నిఫ్టీ, అదే బాటలో సెన్సెక్స్‌

2021-09-15 10:41:27 By Marepally Krishna

img

బుల్‌ జోరుతో నిఫ్టీ కొత్త పుంతలు తొక్కుతోంది. నిన్న నమోదైన ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిని ఇవాళ అధిగమించిన నిఫ్టీ 17459.35కు చేరి ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ప్రస్తుతం 78 పాయింట్ల లాభంతో డే గరిష్ట స్థాయికి సమీపంలో నిఫ్టీ ట్రేడవుతోంది. 


మరోవైపు సెన్సెక్స్‌ కూడా ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి దిశగా దూసుకెళ్తోంది. ఇంతకు ముందు నమోదైన ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి 58,553.07కు ఇవాళ సెన్సెక్స్‌ సమీపంలోకి వచ్చినప్పటికీ ఆ స్థాయిని అధిగమించలేకపోయింది. ప్రస్తుతం 283 పాయింట్ల లాభంతో 58525 వద్ద సెన్సెక్స్‌ ట్రేడవుతోంది. 


జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో జోరు కొనసాగుతోంది. నిన్న 40శాతం పైగా లాభపడిన జీ షేర్‌.. ఇవాళ కూడా మరో 10శాతం పైగా లాభంతో ట్రేడవుతోంది. మిగిలిన షేర్లలో భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా, ఓఎన్‌జీసీ, టైటాన్‌లు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా ఉన్నాయి.


ఎన్టీపీసీ 4.49శాతం, ఓఎన్‌జీసీ 3.51శాతం, టైటాన్‌ 3.13శాతం, భారతీ ఎయిర్టెల్‌ 2.89శాతం, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ 1.64శాతం లాభంతో నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ 0.74శాతం, బీపీసీఎల్‌ 0.56శాతం, గ్రాసీం 0.46శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.39శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 0.30శాతం నష్టంతో నిఫ్టీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. 


bse nse sensex nifty stock market

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending