-->

నష్టాల్లో ట్రేడవుతోన్న దేశీయ మార్కెట్లు

2021-01-14 09:50:25

img

వీక్లీ ఆప్షన్‌ ఎక్స్‌పైరీ కావడంతో ఇవాళ దేశీయ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతోన్నాయి. ఇవాళ ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 60 పాయింట్ల నష్టంతో 49432 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో 14550 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. బోర్డర్‌ మార్కెట్స్‌ మిడ్‌క్యాప్‌ 0.2శాతం, స్మాల్‌ క్యాప్‌ 0.4శాతం లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 220 పాయింట్ల నష్టంతో 49272 వద్ద, నిఫ్టీ 69 పాయింట్ల నష్టంతో 14496 వద్ద ట్రేడవుతోన్నాయి. ఇవాళ ఉదయం స్వల్ప లాభాల్లో ట్రేడైన బ్యాంక్‌ నిఫ్టీ ప్రస్తుతం నష్టాల్లోకి జారుకుంది.

 

విప్రో, ఇన్ఫోసిస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టాటా మోటార్స్‌లు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా ఉన్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.78శాతం, ఐటీసీ 1.70శాతం, యూపీఎల్ 1.40శాతం, బ్రిటానియా 1.21శాతం, మహీంద్రా అండ్‌ మహీంద్రా 0.82శాతం లాభంతో నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. విప్రో 3.56శాతం, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 3.40శాతం, ఇన్ఫోసిస్‌ 2.89శాతం, టెక్‌ మహీంద్రా 2.80శాతం, ఏషియన్‌ పెయింట్స్‌ 1.69శాతం నష్టంతో నిఫ్టీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.

 

Nifty IT
26462.50 -541.80 -2.01%

BSE SmallCap
18787.06 -63.60 -0.34%

BSE MidCap
19075.32 -12.27 -0.06%

Nifty Auto
10190.30 -18.20 -0.18%

BSE Cap Goods
19764.69 119.16 +0.61%

BSE Cons Durable
30635.16 -6.93 -0.02%

BSE FMCG
12786.40 56.22 +0.44%

BSE Healthcare
21971.63 -92.80 -0.42%

BSE Metals
12469.00 -155.24 -1.23%

BSE Oil & Gas
15205.05 85.82 +0.57%

BSE Teck
12085.60 -229.83 -1.87%

Nifty PSE
3030.80 1.30 +0.04%