నష్టాల్లో కొనసాగుతోన్న మార్కెట్లు

2021-06-17 10:01:26 By Marepally Krishna

img

మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా యూఎస్‌ ఫెడ్‌ నిర్ణయాలు లేకపోవడంతో ఇవాళ దేశీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతోన్నాయి. 2023 తర్వాత వడ్డీరేట్లను యూఎస్‌ ఫెడ్‌ పెంచుతామని సంకేతాలిచ్చింది. దీంతో 15 నెలల తర్వాత సింగిల్‌డేలో డాలర్‌ స్ట్రాంగ్‌గా ట్రేడవుతోన్నాయి. మరోవైపు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లన్నీ ఇవాళ అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. గ్లోబల్‌ మార్కెట్ల సపోర్ట్ లేకపోవడం మన మార్కెట్లపై కూడా ప్రభావం పడింది. ఇవాళ్టి వీక్లీ ఆప్షన్స్‌ ముగియనుండటంతో మార్కెట్లకు లోయర్‌ లెవల్స్‌లో కొంత మద్దతు లభించినప్పటికీ ఇంకా నష్టాల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం నిఫ్టీ 40 పాయింట్లు, సెన్సెక్స్‌ 130 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోన్నాయి. 


కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, టెక్నాలజీ మినహా అన్ని రంగాల కౌంటర్లు అమ్మకాల ఒత్తిడికి గురవుతోన్నాయి. అదాని పోర్ట్స్‌, టాటా స్టీల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌లు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా ఉన్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌ 0.90శాతం, నెస్లే 0.83శాతం, శ్రీ సిమెంట్స్‌ 0.71శాతం, అల్ట్రా టెక్‌ సిమెంట్ 0.65శాతం, ఐషర్‌ మోటార్స్‌ 0.35శాతం లాభంతో నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. అదాని పోర్ట్స్‌ 2.65శాతం, టాటా స్టీల్‌ 1.37శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 0.97శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.91శాతం, హీరోమోటోకార్ప్ 0.89శాతం నష్టంతో నిఫ్టీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. 

Share Markets Live: Sensex, Nifty Open Lower; Adani Stocks Continue Slide


bse nse sensex nifty stock market sgx nifty telugu