ఈనెల 30న స్టార్‌ హెల్త్ ఇన్సూరెన్స్ ఐపీఓ

2021-11-24 23:15:34 By Y Kalyani

img

రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా 14శాతానికి పైగా వాటాలున్న స్టార్‌ హెల్త్‌ అండ్‌ అల్లీడ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ పబ్లిక్ ఇష్యూ నవంబరు 30న ప్రారంభం కానుంది. డిసెంబరు 2 వరకు సబ్‌స్క్రిప్షన్‌ ఉంటుంది. ప్రైస్ బాండ్ రూ.870-900గా నిర్ణయించారు. మొత్తం రూ.7,249 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ.2,000 కోట్లు తాజా ఇష్యూతో పాటు మిగిలిన మొత్తం ఆఫర్ ఫర్ సేల్ కింద వస్తోంది.  58,324,225 కోట్ల ఈక్విటీ షేర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయించనున్నారు. రూ.100 కోట్లు విలువ చేసే షేర్లను ఉద్యోగులకు రిజర్వ్‌ చేశారు. ఈ ఇష్యూ ద్వారా సమకూరే నిధులతో కంపెనీ క్యాపిటల్‌ బేస్‌ను పెంచనున్నారు. 75 శాతం షేర్లను క్యాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్స్‌కు, 15 శాతం సంస్థాగత, పది శాతం షేర్లు రిటైల్‌ మదుపర్లకు కేటాయించారు. లాట్‌కు 16 షేర్లను నిర్ణయించారు.

స్టార్ హెల్త్ యొక్క IPOలో రూ. 2,000 కోట్ల తాజా ఇష్యూ కాగా.. ప్రమోటర్లతో సహా ప్రస్తుత వాటాదారుల ద్వారా రూ. 5,500 కోట్ల వరకు ఆఫర్ ఫర్ సేల్ పెడుతున్నారు. సేఫ్‌క్రాప్ ఇన్వెస్ట్‌మెంట్స్, కోణార్క్ ట్రస్ట్ మరియు MMPL ట్రస్ట్ ఉన్నారు. నాన్-ప్రమోటర్లలో, Apis గ్రోత్, యూనివర్శిటీ ఆఫ్ నోట్రే డామ్ మరియు MIO స్టార్ కూడా తమ వాటాలను తగ్గించుకుంటాయి.
ప్రస్తుతం, ప్రమోటర్లకు కంపెనీలో 62.80% వాటా ఉంది. కంపెనీలో సేఫ్‌క్రాప్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇండియా ఎల్‌ఎల్‌పికి 45.32%, బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా మరియు అతని భార్య రేఖా జున్‌జున్‌వాలా కలిసి 17.26% వాటాను కలిగి ఉన్నారు.


star ipo news

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending