పెద్ద కంపెనీ అయితే ఎవడికి గొప్ప.. చట్టాలు పాటించాల్సిందే

2021-09-24 23:01:18 By Y Kalyani

img

పెద్ద కంపెనీ అయితే ఎవడికి గొప్ప.. చట్టాలు పాటించాల్సిందే
గూగుల్ కు షాకిచ్చిన ఢిల్లీ హైకోర్డు

ప్రపంచ స్థాయి దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్‌కు ఢిల్లీ హైకోర్టులో షాక్ త‌గిలింది. కాంపిటీష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా ద‌ర్యాప్తును నిలిపివేసేందుకు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇవ్వ‌డానికి నిరాక‌రించింది. ఇండియాలో వ్యాపారం చేయాలంటే ఇక్కడ చట్టాలు, నిబంబధనలు పాటించాల్సిందేనని స్పష్టత ఇచ్చింది. దేశీయ చ‌ట్టాల‌ను తెలుసుకుని మరీ రావాలని కాలిఫోర్నియాలో ఉన్న కంపెనీకి చెప్పమని మరీ లాయర్లకు తెలిపింది. 
కాలిఫోర్నియా ఆఫీసు నుంచి సంస్థ సీనియ‌ర్ అధికారి ఒక‌రు సీసీఐ చైర్మ‌న్‌కు బెదిరింపు స్థాయిలో ఓ లేఖ రాశార‌ని అడిషనల్ సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ ఎన్ వెంక‌ట్రామ‌న్ కోర్టుకు తెలిపారు. ద‌ర్యాప్తు నివేదిక బ‌హిర్గ‌తం చేసిన వారిపై న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని గూగుల్ ఆ లేఖ‌లో హెచ్చ‌రించింది. దీనిపై న్యాయస్థానం సీరియస్ అయింది. సెర్చింజ‌న్ గూగుల్ త‌మ‌పై బెదిరింపుల‌కు దిగుతున్న‌ద‌ని కాంపిటిష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా ఆరోపించింది. 

గూగుల్‌పై 2019లో సీసీఐ స‌మ‌గ్ర ద‌ర్యాప్తున‌కు ఆదేశించింది. ఆండ్రాయిడ్ సర్వీసుల విషయంలో ఆధిప‌త్యాన్ని గూగుల్ దుర్వినియోగం చేసిన‌ట్లు సీసీఐ ద‌ర్యాప్తులో తేలింది. ఇది పత్రికలకు లీక్ అయింది. ఇండియా కాంపిటీష‌న్ యాక్ట్‌లోని 4(2)(ఏ)ఐ, 4 (2) (బీ), 4 (2) (సీ), 4 (2) (డీ) సెక్ష‌న్ల‌ను గూగుల్ ఉల్లంఘించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో సీసీఐకి వ్య‌తిరేకంగా గురువారం ఢిల్లీ హైకోర్టులో గూగుల్ ఇండియా రిట్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. దర్యాప్తు నిలిపివేయాలని కోరింది. దీనికి కోర్టు అంగీకరించలేదు. 


google case delhi hicourt

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending