ఫోర్టీస్ హెల్త్ ఇంకా ఉంది.. అంటున్న ఇన్వెస్టర్లు

2021-04-14 08:36:31 By Y Kalyani

img

ఫోర్టీస్ హెల్త్ ఇంకా ఉంది.. అంటున్న ఇన్వెస్టర్లు

ఫోర్టీస్ లో ఏస్ ఇన్వెస్టర్ తన వాటా పెంచుకున్నారు. అటు మ్యూచ్ వల్ ఫండ్ వాటాలు పెరిగాయి.FPI లు స్వల్పంగా తగ్గాయి. అయితే కంపెనీ షేరు మాత్రం దూకుడు కంటిన్యే అవుతోంది. రాకేష్ ఎఫెక్ట్ తో ఇంకా పరుగులు తీస్తుందా.. అన్నది మార్కెట్లో టాక్.  
ఇండియన్ ఏస్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝన్ ఝన్ వాలా ఫోర్టిస్ హెల్త్‌కేర్‌లో తన వాటాను పెంచుకున్నారు. 2021 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో కంపెనీలో కొత్తగా 25.50 లక్షల షేర్లను కొత్తగా కొన్నారు. ఏప్రిల్ 13న కంపెనీ BSEకు దాఖలు చేసిన వివరాల ప్రకారం కంపెనీలో రాకేష్ ఫోర్టిస్ హెల్త్‌కేర్‌లో 3,25,50,000 షేర్లను కలిగి ఉన్నారు. ఆయన వాటా విలువ 4.31 శాతం. అంతకుముందు FY21 డిసెంబర్ త్రైమాసికం నాటికి రాకేష్ ఆయన భార్చ రేఖకు కలిపి సమిష్టిగా 3 కోట్ల షేర్లను మాత్రమే కలిగి ఉన్నారు.ఇందులో రాకేష్ మాత్రమే కాదు.. మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు కూడా 8,11,14,159 షేర్ల అంటే 10.74 శాతం వాటా నుండి మార్చి త్రైమాసికం నాటికి వాటాను 9,24,68,105 అంటే 12.25 శాతానికి పెంమచుకున్నాయి. 
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు FPIలు మార్చి త్రైమాసికంలో తమ వాటాను 25,98,43,083 షేర్లకు 34.42 శాతం వాటా తగ్గించుకున్నాయి. అంతకుముందు డిసెంబర్ త్రైమాసికంలో 27,80,19,996 షేర్లు అంటే 36.83 శాతం వాటా ఉండేది. మార్చి త్రైమాసికంలో ఫోర్టిస్ హెల్త్‌కేర్ షేర్లు బిఎస్‌ఇలో 28.43 శాతం పెరిగాయి, ఈక్విటీ బెంచ్‌మార్క్ సెన్సెక్స్‌లో 3.68 శాతం పెరిగింది. 


market stocks dalalstreet bse nse it shares profit trade

Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending