గత 4 రోజులుగా జోరుమీదున్న దేశీయ మార్కెట్లు ఇవాళ నెమ్మదించాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య సెన్సెక్స్, నిఫ్టీలు మిశ్రమంగా ముగిశాయి. మార్నింగ్ సెషన్లో జోరుమీదున్న దేశీయ మార్కెట్లు మిడ్‌సెషన్ తర్వాత ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఒకదశలో సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోకి జారుకున్నాయి. చివరకు సెన్సెక్స్ 25 పాయింట్ల నష్టంతో 49492 వద్ద, నిఫ్టీ 1 పాయింట్ లాభంతో 14565 వద్ద ఇవాళ్టి ట్రేడింగ్‌ను ముగించాయి.
బ్యాంక్ నిఫ్టీ ఇవాళ ట్రేడింగ్ ఆసాంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనై చివరకు 236 పాయింట్ల లాభంతో 32574 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టీలోని సెక్టార్స్ విషయానికి వస్తే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ ఇవాళ 3.3శాతం లాభపడింది. మిగిలిన రంగాల్లో నిఫ్టీ ఆటో 0.9శాతం, నిఫ్టీ బ్యాంక్ 0.7శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.4శాతం, మెటల్ 0.4శాతం, మీడియా 0.3శాతం, ఐటీ 0.1శాతం లాభపడ్డాయి. నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌లు మాత్రం ఇవాళ అమ్మకాల ఒత్తిడికి లోనై మార్కెట్లను డ్రాగ్ చేశాయి.
ఇండియా ఒలటాలిటీ ఇండెక్స్ విషయానికి వస్తే 1.9శాతం పెరిగి 23.29కు చేరింది. ఎన్ఎస్ఈలో 643 స్టాక్స్ లాభపడగా, 1260 స్టాక్స్ నష్టాలను చవిచూశాయి. భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్‌లు ఇవాళ్టి ట్రేడింగ్‌లో చురుగ్గా కదలాడాయి.
ఎంఅండ్ఎం 6.22శాతం, అదాని పోర్ట్స్ 4.97శాతం, ఎస్బీఐ 4.89శాతం, ఐఓసీ 3.06శాతం, ఎన్టీపీసీ 2.40శాతం లాభంతో నిఫ్టీ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ 2.79శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.76శాతం, శ్రీ సిమెంట్స్ 2.53శాతం, యూపీఎల్ 1.95శాతం, బజాజ్ ఫిన్సర్వ్ 1.85శాత నష్టంతో ఇవాళ్టి నిఫ్టీ టాప్‌లూజర్స్‌గా ఉన్నాయి.