రిటైల్ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. సెబీ సంచలన నిర్ణయం

2021-08-02 22:21:05 By Y Kalyani

img

రిటైల్ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. సెబీ సంచలన నిర్ణయం

రీసెంట్ గా సెబీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా REITs, InvITsలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నవారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఇక మీదట కనీస మొత్తాన్ని భారీగా తగ్గించింది. గతంలో REITలకు రూ.50వేలు, Invitsలో ప్రైమరీ మార్కెట్లో ధరఖాస్తు చేయాలంటే మినిమం రూ.లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉండేది. ఐపీఓల సమయంలో ఈ నిబంధన కారణంగా చాలామంది ఇన్వెస్టర్లు వీటిలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకురావడం లేదు. తాజాగా ఈ నిబంధనలు మార్చింది. జులై30న రెండు సపరేట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో భాగంగా రూ.10వేల నుంచి 15వేలు ఉంటే సరిపోతుంది. ఇక మీదట కనీసం 100 యూనిట్లు కొనాలన్న నిబంధన కూడా ఎత్తేసింది. ఒక్క యూనిట్ కూడా కొనుగోలు చేయవచ్చు. 

పెరుగుతున్న మార్కెట్..
గత రెండేళ్లుగా REITs, InvITs కు డిమాండ్ భాగా పెరిగింది. పెట్టుబడిదారులు వీటిపై ఫోకస్ చేస్తున్నారు. ప్రాఫిట్ యాంగిల్.. సేఫ్ గేమ్ ఆడటానికి సరైన పెట్టుబడిగా చూస్తున్నారు. ఒక్కసారి గణాంకాలు చూస్తే ఏ రేంజిలో దీనికి డిమాండ్ పెరిగిందో అర్థమవుతుంది. 2020-21లో ఈ REITs, InvITsలు  కలిపి 55,000 కోట్ల రూపాయలను సమీకరించాయి. నికర ఆస్తుల విలువ కూడా రూ .1.64 లక్షల కోట్లకు చేరింది. 2020-21లో మొత్తం రూ .40,432 కోట్లు మౌలిక సదుపాయాల పెట్టుబడి ట్రస్టులు InvITs సమీకరించగా రూ .14,300 కోట్లను REITsలు సమీకరించినట్టు సెబీ ప్రకటించింది. మార్కెట్లో మోస్ట్ ఫోకస్డ్ అండ్ స్పీడ్ ఎమెర్జింగ్ మార్కెట్ గా ఈ విభాగం ఎదుగుతోంది. ఇన్విట్స్ 2019-20లో రూ .8,573 కోట్లు సమీకరించగా, REITలు మాత్రం గత ఏడాది కొత్తగా మార్కెట్లో ప్రవేశించాయి. మార్చి 2021 నాటికి ఇన్విట్‌ల నికర ఆస్తి 1.05 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. 2020 మార్చి నాటికి రూ .45,396 కోట్లుగా ఉంది. REITలకు 58,430 కోట్ల రూపాయలున్నాయి. 2019-20లో రూ .28,910 కోట్లు మాత్రమే.
మార్కెట్లో మొత్తం 15 ఇన్విట్స్ కంపెనీలు లిస్ట్ కాగా.. నాలుగు మాత్రమే REITలు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో ఉన్నాయి. ఇటీవల సెబీ తీసుకున్న నిర్ణయాల కారణంగా ఈ రంగంలో రిటైల్ ఇన్వెస్టర్లు కూడా పెరుగుతారు.


reits market stocks reaestate profit

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending