హైదరాబాద్ KIMSకు సెబీ గ్రీన్ సిగ్నల్

2021-05-04 09:40:30 By Y Kalyani

img

హైదరాబాద్ KIMSకు సెబీ గ్రీన్ సిగ్నల్

కృష్ణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స KIMS ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఐపీఓ ద్వారా రూ.700 కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉంది. పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా రూ.200 కోట్ల వరకకు కొత్త ఈక్విటీలను కిమ్స్‌ జారీ చేయనుంది. ప్రమోటర్లు, ఇతర వాటాదారులు కలిసి మరో 2,13,40,931 షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా విక్రయించనున్నారు. ఐపీఓలో కొనుగోలు చేసేందుకు వీలుగా కంపెనీ అర్హులైన ఉద్యోగులకు కొన్ని షేర్లను రిజర్వ్‌ చేయనుంది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సేకరించిన నిధులను కిమ్స్‌ తన, అనుబంధ విభాగాల రుణాలను తిరిగి చెల్లించేందుకు ఉపయోగించనుంది. 
హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కిమ్స్‌ అతిపెద్ద కార్పొరేట్‌ హాస్పిటల్‌ కంపెనీల్లో ఒకటి. 9 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్వహిస్తోంది. 2020 డిసెంబరు 31 నాటికి ఈ హాస్పిటళ్లు మొత్తం 3,064 పడకల సామర్థ్యం కలిగి ఉంది. కార్డియాక్‌ సైన్సెస్‌, ఆంకాలజీ, న్యూరోసైన్సెస్‌, గ్యాస్ట్రిక్‌ సైన్సెస్‌, ఆర్థోపెడిక్‌ చైల్డ్‌ కేర్‌ సహా 25కు పైగా సేవలందిస్తోంది. 


ipo kims hyderabad company news

Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending