వైట్ ఓక్ క్యాపిటల్ గ్రూప్‌నకు ఎంఎఫ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి సెబి గ్రీన్ సిగ్నల్

2021-09-25 13:21:49 By VANI

img

వైట్ ఓక్ క్యాపిటల్ గ్రూప్, దాని అనుబంధ సంస్థ జీపీఎల్ ఫైనాన్స్ ద్వారా ఆగస్టు 2020లో YES మ్యూచువల్ ఫండ్‌ను కొనుగోలు చేసింది. ఇక మున్ముందు స్వయంగా మ్యూచువల్ ఫండ్ బిజినెస్‌లోకి దిగబోతోంది. ఈ క్రమంలోనే తాజాగా మ్యూచువల్ ఫండ్ (MF) వ్యాపారాన్ని నిర్వహించడానికి సెబీ నుంచి అనుమతి పొందింది. ఇంతకుముందు YES MF కోసం స్పాన్సర్‌గా ఉన్న YES బ్యాంక్, నాన్-కోర్ బిజినెస్ నుంచి బయటపడే ప్రణాళికలలో భాగంగా MF వ్యాపారాన్ని విడిచిపెట్టింది. 

 

వైట్ ఓక్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ ఖేమ్కా, గోల్డ్‌మన్ సాక్స్ AMCలో GS ఇండియా ఈక్విటీ, గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్‌ల చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, లీడ్ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌. ఇక మున్ముందు MF పెట్టుబడిదారులు చాలా MF పథకాలు, ఫండ్ హౌస్‌లను ఎంచుకోవచ్చు. ఎందుకంటే.. అనేక ఆర్థిక సంస్థలు, PMS సంస్థలు తమ స్వంత మ్యూచువల్ ఫండ్ వ్యాపారాలను ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధమవుతున్నాయి.

 

వారం ముందు, సామ్కో మ్యూచువల్ ఫండ్ దాని ప్రారంభాన్ని ప్రకటించింది. పెట్టుబడి వ్యూహాన్ని అనుసరించబోతోంది. దేశంలో అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఎన్‌జే ఇండియా కూడా ఇటీవల తన వ్యాపారాన్ని ప్రారంభించింది. సెప్టెంబర్ 13, 2021 న తన మొదటి ఎంఎఫ్ స్కీమ్‌ను దాఖలు చేసినట్లు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ మద్దతు ఇస్తున్న నవీ MF.. నిఫ్టీ ఇండెక్స్ ఫండ్‌ను అతి తక్కువ వ్యయ నిష్పత్తితో ప్రారంభించిన తర్వాత సెబికి పది కొత్త ఫండ్స్ కోసం దాఖలు చేసింది.


Sebi Green Signal  White Oak Capital  MF Business  YES Mutual Fund  YES Bank

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending