Rolex Rings కంపెనీ IPOధరఖాస్తు చేయవచ్చా

2021-07-27 23:44:47 By Anveshi

img

Rolex Rings కంపెనీ IPOధరఖాస్తు చేయవచ్చా

Rolex Rings కంపెనీ మార్కెట్లోకి వస్తుంది. దీనిపై భారీగానే అంచనాలున్నాయి. ఇంతకీ ధరఖాస్తు చేయవచ్చా అన్న సందేహాలు సహజం. ఇప్పటికే కంపెనీ 26 యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా రూ.219.3 కోట్లు సమీకరించింది. 24లక్షల 36వేల 666 ఈక్విటీ షేర్లు కేటాయించింది. యూనిట్ రూ.900 వద్ద అలాట్ చేసింది. 

ఇష్యూ గురించి...
సబ్ స్ర్రిప్షన్ :     జులై 28-30
ప్రైస్ బ్యాండ్ :     రూ.880-900 / షేరు
ఇష్యూ సైజ్ :     రూ.675 కోట్లు
మనీ యూజ్:     లాంగ్ టర్మ్ వర్కింగ్ కేపిటల్, కార్పొరేట్ అవసరాలు

కంపెనీ గురించి...
ఉత్పత్తి సామర్థ్యం పరంగా కంపెనీ దేశంలోని టాప్ 5 కంపెనీల్లో ఒక్కటిగా ఉంది.  ఉత్పత్తి మరియు విదేశాలకు హాట్ రోల్ పోర్జ్ డ్ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఇందులో మిషిన్డ్ బేరింగ్ రింగ్స్ మరియు ఆటో కాంపోనెంట్స్ ఉన్నాయి. 2Ws, ప్యాసింజర్, కమర్శియల్, ఆఫ్ రోడ్ వాహనాలు, విద్యుత్ వాహనాలకు అవసరమైన కాంపొనెంట్స్ ఎగుమతి చేస్తోంది.  అలాగే ఇండస్ట్రీయల్ మిషనరీ కూడా సరఫరా చేస్తుంది. విండ్ టర్బైన్స్, రైల్వే, సెగ్మెంట్లో కొన్ని ఉత్పత్తులున్నాయి. మొత్తం 60 కంపెనీలకు 70దేశాలకు ఎగుమతి చేస్తోంది. అమెరికా, యూరోప్ దేశాల్లో కూడా కంపెనీ క్లయింట్స్ ఉన్నారు. మార్కెట్లో 70శాతం ఉత్పత్తులను 10 అతిపెద్ద కంపెనీలకు సరఫరా చేసింది. గత పదేళ్లుగా ఈ సంస్థతో ఒప్పందాలు చేసుకున్నాయి.  
రాజ్ కోట్ లో మూడు ఉత్పత్తి యూనిట్లున్నాయి. 1.44 లక్షల MTPA ఫోర్జింగ్ ఉత్పత్తి సాధించింది. అలాగే 6.9 కోట్ల కాంపోనెంట్స్ ఏడాదికి తయారుచేస్తోంది. ఈ విభాగంలో భారత్ ఫోర్జ్, RKFL, MMF కంపెనీలు లిస్ట్ అయ్యాయి. 

కంపెనీ రెవిన్యూ..
FY21- ఆదాయం - రూ.616 కోట్లు, PAT-రూ.87కోట్లు
FY20- ఆదాయం - రూ.666 కోట్లు, PAT-రూ.53కోట్లు
FY21- ఆదాయం - రూ.904 కోట్లు, PAT-రూ.59కోట్లు

కంపెనీ బలాలు..
ఇంటిగ్రీటెడ్ ప్రోడక్ట్ పోర్ట్ ఫోలియో దీనికి బలం
లోకేషన్ అడ్వాంటేజ్
ఉత్పత్తి సామర్థ్యం
లాంగ్ స్టాండింగ్ కస్టమర్ రిలేషన్
విభిన్నరంగాల ద్వారా ఆదాయం
ఆదాయం పెంచుకోవడానికి వ్యాపార వ్రుద్ధిపై ఫోకస్
వాల్యూ యాడెడ్ ఉత్పత్తులపై ఫోకస్
అనుభవం ఉన్న టీమ్

రిస్క్ కూడా ఉంది...
గతంలో కంపెనీ రుణాల డిఫాల్గ్ హిస్టరీ
డెట్ రిస్ట్రక్చరింగ్ జరిగింది
కేవలం 10మంది కస్టమర్లపైనే అధికంగా ఆధారపడటం

సో ఇవి కంపెనీకి సంబంధించిన పూర్తివివరాలు.. షేర్ల కోసం ధరకాస్తు చేయాలా వద్దా అన్నది నిపుణుల సలహాలు తీసుకుని ప్రయత్నించండి


ipo rolex rings news

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending