రిలయన్స్ బంపర్ రిజల్ట్.. 46శాతం పెరిగిన లాభం

2021-10-22 22:42:00 By Y Kalyani

img

రిలయన్స్ బంపర్ రిజల్ట్.. 46శాతం పెరిగిన లాభం

దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ 2021-22 ఫైనాన్షియల్ ఇయర్ రెండో త్రైమాసికానికి ఆర్థిక ఫలితాలు వెల్లడించింది. 3 నెలల కాలానికి సంస్థ రూ. 15,479 కోట్ల నికర లాభాలను ప్రకటించింది. గత ఆర్ధికం సంవత్సరం ఇదే సమయంతో పోల్చితే నెట్ ప్రాఫిట్ ఏకంగా 46శాతం పెరిగింది. గత సంవత్సరం కంపెనీ రూ.10, 602 కోట్లు నెట్ ప్రాఫిట్ సాధించింది. ఇక ప్రస్తుతం ఆర్ధిక సంవత్సరంలో జూన్ తో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్  రూ. 13,806 కోట్లు ప్రాఫిట్ చూపించింది. రిటైల్ రంగంలో కోవిడ్ అనంతరం స్ట్రాంగ్ గ్రోత్, అటు డిజిటల్, ఆయిల్ వ్యాపారాల్లో కూడా ఆదాయం పెరగడంతో కంపెనీ లాభాలు పెరిగాయి. 
కంపెనీ ఆదాయం మొత్తం రూ.1.74 లక్షల కోట్లుగా ఉంది. అంటే గత ఏడాది కంటే ఇది 49.8శాతం పెరిగింది. గడిచిన సంవత్సరం ఇదే కాలానికి సంస్థ రెవిన్యూ 1.16లక్షల కోట్లుగా ఉంది. 
డిజిటల్ సర్వీస్ బిజినెస్ భారీగా పెరుగుతుంది. కంపెనీ బ్రాడ్ బాండ్ సర్వీస్ రూపంలో కంపెనీ ప్రాఫిట్ 44.1శాతం పెరిగి రూ.9228 కోట్లకు చేరింది. మొత్తం కంపెనీ ఆదాయం కూడా గత ఏడాదితో పోల్చితే ఇది 68.8శాతం పెరిగి రూ.1.08లక్షల కోట్లకు చేరింది.

జియో ఫ్లాట్ ఫాం...
జియో ఈ త్రైమాసికంలో రూ.19777 కోట్ల ఆదాయం సాధించింది. 15.1 శాతం పెరిగింది. గత త్రైమాసికం కంటే కూడా 3.7శాతం పెరిగి  రెవిన్యూ పర్ యూజర్ రూ.143.6 కి చేరింది. 4జీ కవరేజిలో కంపెనీ టాప్ పోజిషన్ లో ఉంది. కస్టమర్లు మొత్తం 429.5 మిలియన్లు మంది ఉన్నారు. కొత్తగా 23.8 మిలియన్ల మంది సబ్ స్క్రైబ్ అయ్యారు. కంపెనీ నెట్ ప్రాఫిట్ 23.5శాతం పెరిగి.... రూ.3728 కోట్లకు చేరింది. 

రిటైల్ బిజినెస్...
రిటైల్ వ్యాపారం స్ట్రాంగ్ గ్రోత్ నమోదు చేసింది. 9.2శాతం గ్రోత్ తో మొత్తం రెవిన్యూ రూ.39,926 కోట్లకు చేరింది. అన్ని విభాగాల్లోనూ మంచి అమ్మకాలు సాధించింది. పండగలు, అటు కొవిడ్ నిబంధనలు సడలించడంలో రిటైల్ మంచి వ్యాపారం చేసింది. త్రైమాసికంలో కంపెనీ రూ.1695 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 

ఆయిల్ టు కెమికల్...
O2C కూడా మళ్లీ మూమెంట్ అందుకుంది. గత ఏడాది రెండో త్రైమాసికంతో పోల్చితే ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ  58.1శాతం బిజినెస్ గ్రోత్ నమోదు చేసింది. రెవిన్యూ 1.2లక్షల కోట్లుగా ఉంది.


RIL q2 result latest news jio

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending