అవును... ZEE కొందామనుకున్నా బేరం కుదరలేదు

2021-10-13 21:47:51 By Y Kalyani

img

అవును... ZEE కొందామనుకున్నా బేరం కుదరలేదు
వాళ్లు వాళ్లు కొట్టుకున్నారు.. మేం సైడయ్యాం
సంచలన ప్రకటన చేసిన రిలయన్స్

జీ ఎంటర్ ప్రైజెస్, ఇన్వెస్కో మధ్య వివాదంలో రిలయన్స్ పేరు రావడంపై సంస్థ స్పందించింది. జీ మీడియా సంస్థల్ని కొనుగోలు చేసేందుకు రిలయన్స్ నుంచి వచ్చిన ఆఫర్ చాలా తక్కువ వ్యాల్యుయేషన్‌తో ఉందని జీ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ గోయెంకా షేర్ హోల్డర్లకు లేఖ రాశారు. దీంతో స్పందించిన RIL  2021 ఫిబ్రవరి, మార్చిలో పునీత్ గోయెంకాతో తమ ప్రతినిధులు నేరుగా చర్చల్ని జరిపేందుకు ఇన్వెస్కో సహకరించిందని రిలయన్స్ తెలిపింది. జీ సంస్థలతో పాటు తమ సంస్థల్ని వ్యాల్యుయేషన్ చేసేందుకు ఒకే తరహా ప్యారామీటర్స్ ఫాలో అయ్యామని రిలయన్స్ తెలిపింది. జీ వాటాదారులతో సహా అందరికీ విలువను సృష్టించడానికి ప్రయత్నించామని ప్రమోటర్లకు, ఇన్వెస్టర్లకు మధ్య వచ్చిన విబేధాల కారణంగా తప్పుకున్నట్టు తెలిపింది. 
ఫెయిర్ డీల్ పెట్టామని.. ఇందులో గోయెంకాను మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగించాలన్న ప్రతిపాదన కూడా ఉందంటోంది రిలయన్స్. గోయెంకాతో పాటు టాప్ మేనేజ్‌మెంట్‌కు ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్ ESOPs ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా చేసినట్టు తెలిపింది. ఇన్వెస్కో, జీ వ్యవస్థాపకుల మధ్య అభిప్రాయభేదాలు రావడంతో ఈ డీల్‌పై చర్చలు ముందుగు సాగలేదని రిలయన్స్ స్పష్టం చేసింది. 


deal zee ril invesco

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending