అప్పుల ఊబిలో రియల్ ఎస్టేట్ రుణాలు.. లబోదిబో అంటున్న బ్యాంకులు

2021-07-27 09:02:01 By Y Kalyani

img

అప్పుల ఊబిలో రియల్ ఎస్టేట్ రుణాలు.. లబోదిబో అంటున్న బ్యాంకులు

దేశీయ రియల్ ఎస్టేట్ రంగం అప్పుల ఊభిలో కూరుకుపోతుంది. గడిచిన ఏడాదిలో ఇది మరింత పెరిగినట్టు తెలుస్తోంది. మొత్తం రియాల్టీ రంగంలో 1.34 లక్షల కోట్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు చెబుతున్నారు. అంటే మొత్తం రుణాల్లో 18శాతం మొండి బకాయిలుగా మారే ప్రమాదం ఉందని ప్రముఖ ప్రాపర్టీ సంస్థ అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ నివేదించింది. 

ఏదేమైనా, సుమారు 5 లక్షల కోట్ల రూపాయల విలువైన రుణాలు సాఫీగానే చెల్లింపులు జరుగుతున్నాయి. మొత్తం రుణాలు 7.44 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంటే 67%  పూర్తిగా ఒత్తిడి లేనివి. మరో 15%, లేదా 1.12 లక్షల కోట్ల రూపాయలు తీవ్ర ఒత్తిడికి ఉన్నట్టు చూపిస్తున్నాయి. అయితే కోవిడ్ నుంచి మళ్లీ కోలుకుంటున్న నేపథ్యంలో మొండి బకాయిలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు మార్కెట్ ఎనలిస్టులు.


realty real estate investments

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending