MPC లీకులపైనే మార్కెట్ భవితవ్యం

2021-12-05 20:39:18 By Y Kalyani

img

MPC లీకులపైనే మార్కెట్ భవితవ్యం

రెపోరేట్లు పెంచాలని భావించిన ప్రతిసారీ ఏదో ఒక ఆటంకం వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాలుమొదలయ్యాయి. దీంతో కీలక వడ్డీ రేట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ ఇండియా యథాతథంగా ఉంచే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. 
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని కొనసాగిస్తూనే వృద్ధికి దోహదం చేసే విధంగా కీలక వడ్డీ రేట్లను సవరించాలి. అయితే ప్రస్తుత ప్రతికూల సమయంలో నిర్ణయం వద్దని భావిస్తోంది. ఆర్‌బీఐ వేచి చూడొచ్చని తెలుస్తోంది. సోమవారం నుంచి మూడ్రోజుల పాటు ఆర్‌బీఐ గవర్నర్‌ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ MPC భేటీ కానుంది. కీలక వడ్డీ రేట్లపై బుధవారం ఆర్‌బీఐ ప్రకటన చేయనుంది. 
రివర్స్‌ రెపో రేట్లను నామమాత్రంగా సవరించే అవకాశం ఉందని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ అనరాక్‌ అభిప్రాయపడింది. ఒకవేళ ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచితే అది వరుసగా తొమ్మిదో సారి అవుతుంది. చివరి సారిగా 2020 మే 22న వడ్డీ రేట్లను సవరించింది. భవిష్యత్‌లో అయితే రెపో రేట్లు పెరుగుతాయని, గృహ రుణ వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. 

స్టాక్ మార్కెట్లో సోమవారం RBI మానిటరీ పాలసీ లీకులపై ఆధారపడి ఉంటుంది. అటు ఒమిక్రాన్ తో పాటు.. ఇటు RBI పాలసీనే ప్రధాన అంశాలుగా మారనున్నాయి. 


market share bse nifty bull bear rbi