ఈ స్టాక్ మళ్లీ జోరు చూపించేనా.. భారీగా షేర్లు కొన్న ఇన్వెస్టర్

2021-09-15 08:34:48 By Y Kalyani

img

ఈ స్టాక్ మళ్లీ జోరు చూపించేనా.. భారీగా షేర్లు కొన్న ఇన్వెస్టర్ 

ZEEL స్టాక్ ధరలు సెప్టెంబర్ 14న ఏకంగా 40 శాతానికి పైగా పెరిగింది. దాని అగ్రశ్రేణి వాటాదారులు ఇద్దరు ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEO పునిత్ గోయెంకా మరియు ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్లను బోర్డు నుండి తొలగించాలని కోరిన విషయాన్ని  రెగ్యులేటరీ దాఖలు చేయడంతో ఇది భారీగా పెరిగింది. తాజాగా మరో డెవలప్ మెంట్ కూడా చోటు చేసుకుంది.  

రాకేష్ ఝన్ ఝన్ వాలా ఎంట్రీ...
ప్రముఖ ఏస్ ఇన్వెస్టర్ అయిన రాకేష్ ఝన్ ఝన్ వాలాకు చెందిన స్టాక్ ట్రేడింగ్ సంస్థ రేర్ ఎంటర్‌ప్రైజెస్ సెప్టెంబర్ 14న జీ ఎంటర్‌టైన్‌మెంట్ లో కీలక వాటాను తీసుకుంది. 50 లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. మొత్తం పెయిడ్-అప్ ఈక్విటీలో ఇది 0.52 శాతం. NSE లో ఒక్కో షేరుకు రూ. 220.44 చొప్పున, బల్క్ డీల్స్ డేటాలో ఈ లావాదేవీ చూపించారు. వాటా విలువ రూ .110.22 కోట్లు. అటు BofA సెక్యూరిటీస్ యూరోప్ SA కూడా ఇందులో 48,65,513 ఈక్విటీ షేర్లను రూ. 236.2 చొప్పున కొనుగోలు చేసింది.
 


rakesh jhunjhunwala zee share bofa

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending