మార్కెట్లో డబ్బు సంపాదించడం ఓ ఆర్ట్

2022-01-15 09:07:38 By Y Kalyani

img

మార్కెట్లో డబ్బు సంపాదించడం ఓ ఆర్ట్
పెట్టుబడుల్లో ఎలాంటి పద్దతులు అనుసరించాలి
రాకేష్ ఝన్ ఝన్ వాలా వ్యూహాలు ఆదర్శమా

స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించడం అద్రుష్టం మీద ఉండదు. మీరు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ఈక్విటీ మార్కెట్ నుండి ఏస్ ఇన్వెస్టర్లు సంపాదించిన తీరు ఇందుకు అద్దం పడుతుంది. చాలా మంది బడా ఇన్వెస్టర్లు రాత్రికి రాత్రి స్టార్లు కాలేదు. కానీ లక్ష్యం పెట్టుకుని మంచి అవగాహనతో పెట్టిన పెట్టుబడి మాత్రం కాసులు కురిపించాయి. చాలామంది ఏస్ ఇన్వెస్టర్లు ఎందులో ఇన్వెస్ట్ చేశారు. వారి విజయ రహస్యాలేంటి అని చూస్తుంటారు. వాళ్లను అనుసరించడం మంచిదే.. వాళ్లు చెప్పే మాటలు ఆచరణీయమే. అదే సమయంలో మీరు కూడా శోధన చేసి మరీ మీ మీ పోర్ట్ ఫోలియో డెవలప్ చేయాల్సి ఉంటుంది. 

రాకేష్ ఝన్ ఝన్ వాలా ఎం చేశాడంటే...
ముంబైకి చెందిన పెట్టుబడిదారుడు మరియు దలాల్ స్ట్రీట్‌లో బిగ్ బుల్ గా పేరు పొందిన రాకేష్ జున్‌జున్‌వాలా పోర్ట్‌ఫోలియో రిటర్న్‌లను చేస్తూ ఆయన వ్యూహాలు అర్థమవుతాయి. స్టార్ హెల్త్, టైటాన్, టాటా మోటార్స్, క్రిసిల్, ఎస్కార్ట్, ఫోర్టీస్, సెయిల్ నజారా టెక్నాలజీస్ , జూబ్లియెంట్ వంటి కంపెనీలు ఆయనకు భారీగా లాభాలు ఇచ్చాయి. రెండేళ్లలో 300శాతం వరకూ లాభపడ్డాయి. కొన్ని షేర్లు న్యూట్రల్ గా ఉన్నాయి. మరికొన్ని నష్టాల్లో ఉన్నాయి. అయినా ఆయన పెట్టుబడి చూస్తే పెద్ద కంపెనీల్లో ముఖ్యంగా ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా ఉండి. నాయకత్వం, మార్కెట్లో లీడర్ గా ఉన్న కంపెనీల్లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టి మంచి లాభాలు తీసుకుంటున్నారు. అదే సమయంలో ఫ్యూచర్ పై నమ్మకంతో మరికొన్ని కంపెనీల్లో బెట్ చేశారు. అవి ప్రస్తుతానికి పెద్దగా పెరగకపోయిన భవిష్యత్తులో రాణిస్తాయని నమ్ముతున్నారు.  రెండేళ్లలో రాకేష్ పోర్ట్ ఫోలియో యావరేజ్ గా 100శాతం లాభపడ్డాయి. ఇదే సమయానికి నిఫ్టీ 50శాతం గెయిన్ అయింది.

నిర్ణయాల్లో జాగ్రత్తలు...
పోర్ట్‌ఫోలియోలో పరిమిత స్టాక్‌లు విలువ ఎక్కువగా ఉంటుంది. అంటే కొన్ని స్టాక్స్ లోనే 60శాతం వరకూ ఇన్వెస్ట్ చేయడం. తర్వాత డైవర్శిసిటీ ఖచ్చితంగా ఉండాలి. IT, FMCG, BFSI, కమోడిటీస్, ఫార్మా, ఆటో మొదలైన వాటిలో రాకేష్ పెట్టుబడులు కనిపిస్తాయి. మనం చేసిన శోధన.. నమ్మకంకలిస్తేనే ఇన్వెస్ట్మెంట్ బలంగా ఉంటుంది. ఇక నష్టాలను తగ్గించుకుని లాభాలను పెంచుకోవడం కూడా కీలకం. మార్కెట్ కు అనుగుణంగా ఎప్పటికప్పుడు మీరు పోర్ట్ ఫోలియో విషయంలో మార్పులు చేర్పులు అవసరం.ఇటీవల రాకేష్ టాటా మోటార్స్, టైటాన్ వంటి కంపెనీల్లో షేర్లు పెంచుకున్నారు. అదే సమయంలో కొన్నింటిలో తగ్గించారు. 


rakesh jhunjhunwala today investors