రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఆ ఫార్మా షేర్లు ఎందుకు అమ్మినట్టు

2021-10-14 08:50:48 By Y Kalyani

img

రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఆ షేర్లు అమ్మేశారు

రాకేష్ ఝున్‌ఝున్‌వాలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల కాలంలో రోజుకు వందల కోట్ల సంపద పెంచుకుంటున్న ఏస్ ఇన్వెస్టర్. దేశీయ స్టాక్ మార్కెట్లో ఇతరుల కంటే ముందుగానే అవకాశాలను పసిగట్టడంతో ముందుంటారు. టైటాన్, టాటా మోటర్స్ విషయంలో చెప్పిందే నిజమైంది. 

అతను ఎప్పటికప్పుడు తన పోర్ట్‌ఫోలియోలతో మాజిక్ చేస్తూనే ఉంటారు. తాజాగా ఫార్మా మేజర్ లుపిన్ లిమిటెడ్ లో బిగ్ బుల్ రాకేష్ తగ్గించుకున్నారు. 1% కంటే తక్కువ వాటాలను కలిగి ఉన్న వాటాదారుల పేరును కంపెనీలు సెబీ ఫైలింగ్ లో చూపించవు. అంటే సెప్టెంబర్ 30, 2021 నాటికి ఝన్ ఝన్ వాలా కు కంపెనీలో 1% కంటే తక్కువగా స్టేక్ ఉన్నట్లు చూపిస్తోంది. జూన్ 21 తో ముగిసిన త్రైమాసికంలో చేసిన ఫైలింగ్‌ల ప్రకారం కంపెనీలో జున్‌జున్‌వాలా వాటా 1.6%గా ఉంది. అంటే ఆయన షేర్లు అమ్మినట్టు అర్థమవుతోంది. 

వాటిలో పెంచారు...
జూలై 21 నుంచి సెప్టెంబర్ 21 వరకు, ఝనన్‌ఝున్‌వాలా నేషనల్ అల్యూమినియం కంపెనీ NALCO లో 1.4% మరియు కెనరా బ్యాంక్‌లో 1.6% వాటాలను కొనుగోలు చేశారు. సెప్టెంబరు 21 తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన తాజా ఫైలింగ్‌ల ఆధారంగా మ్యాన్ ఇన్‌ఫ్రా కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్ మరియు ఓరియంట్ సిమెంట్ లిమిటెడ్‌లో అతని వాటా 1.2% వద్ద ఉంది. ఇందులో పెద్దగా మార్పు లేదు. వోక్‌హార్డ్ లిమిటెడ్‌లో ఇది 2.3% ఉంది. ఇతర కంపెనీల్లో అతడి తాజా హోల్డింగ్స్ ఇంకా సెప్టెంబర్ త్రైమాసికానికి దాఖలు చేయాల్సి ఉంది.


rakesh jhunjhunwala zee share bofa

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending