కంపెనీ లాభం అదిరింది.. షేరు ధర పెరిగింది

2021-06-10 23:05:20 By Y Kalyani

img

కంపెనీ లాభం అదిరింది.. షేరు ధర పెరిగింది

Ion Exchange Ltd షేర్ ధర జూన్ లో 37శాతం పెరిగింది. ఏప్రిల్ నుండి 60శాతం వరకూ గెయిన్ అయింది. ఒక్కరోజులో 20శాతం వరకూ లాభపడింది. అయాన్ ఎక్స్ఛేంజ్ షేర్ ధర 123శాతం పెరిగి రూ .2,062 వద్ద ట్రేడవుతోంది. 2021 జనవరి-మార్చి నాలుగో త్రైమాసికంలో నికర లాభం రెట్టింపు అవడంతో పాటు ఆదాయం భారీగా పెరిగింది. అయాన్ ఎక్స్ఛేంజ్ కూడా మంచి త్రైమాసిక పనితీరును కనబరిచింది, జనవరి-మార్చి త్రైమాసికం ముగింపులో ఏకీకృత నికర లాభం రూ .70.48 కోట్లు, గత ఏడాది ఇదే కాలంలో 28.86 కోట్ల రూపాయలు.
బిగ్ బుల్ రాకేష్ ఝన్ ఝన్ వాలా ఇటీవల కంపెనీలో తన వాటాను 5.29% నుండి దాదాపు 1% వరకు తగ్గించారు. ఈ ఏడాది ప్రారంభంలో, రాకేష్ ఝన్ ఝన్ వాలా మరియు అతని సంస్థ RARE ఇన్వెస్టింగ్ కంపెనీ 5.38 లక్షల ఈక్విటీ షేర్లను ఒక్కో షేరుకు 1,205 రూపాయలకు విక్రయించాయి. బిగ్ బుల్ మొత్తం వాటా 2020 డిసెంబర్ చివరిలో 7.75 లక్షల ఈక్విటీ షేర్లగా ఉంది. రాకేష్ 2007 లో మొదటిసారి అయాన్ పెట్టుబడులు పెట్టారు. అప్పుడు కంపెనీ షేరు ధర రూ.230 రూపాయల ధర వద్ద ఉంది. అప్పటి నుండి ఈ స్టాక్ 8 రెట్లు పెరిగింది. అంటేలాంగ్ టర్మ్ వ్యూహాలు ఎలా ఉండాలో ఈ కంపెనీ స్టాక్ చెబుతోంది. 


rakesh jhunjhunwala sameer arora mf mf industry Profit Trade

Expert's View


నేను వేసుకున్న కోటు రంగు , రానున్న రోజుల్లో మార్కెట్ల రంగు ఇదేనా ?

Trending