ఈ కంపెనీ షేర్లు కొనమని సలహా ఇస్తున్న ఏస్ ఇన్వెస్టర్

2021-09-26 10:00:19 By Y Kalyani

img

ఈ కంపెనీ షేర్లు కొనమని సలహా ఇస్తున్న ఏస్ ఇన్వెస్టర్

సెన్సెక్స్ 60,000 మార్క్‌ను అధిగమించినప్పుడు భారత ఏస్ ఇన్వెస్టర్ మరియు దలాల్ స్ట్రీట్ నిపుణుడు అయిన రాకేశ్ ఝన్ ఝన్ వాలా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తన పెట్టుబడులు.. షేర్లపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. గత 15 నెలల్లో టాటా మోటార్స్ తనకున్న అతిపెద్ద పెట్టుబడి అని వెల్లడించాడు. అంతేకాదు గేమింగ్ మరియు న్యూ ఏజ్ డిజిటల్ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టినట్టు చెప్పారు. అదే స్పోర్ట్స్ మీడియా ప్లాట్‌ఫాం నజారా టెక్నాలజీస్.

TATA షేర్లదే ఫ్యూచర్ అట..
టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ప్రవేశించడం స్టాక్‌ను మరింత పెంచుతుందని బిలియనీర్ రాకేష్ అంటున్నారు. నా జీవితంలో అతిపెద్ద పెట్టుబడులలో ఇది ఒకటిగా మారడానికి అది కూడా ఓ కారణం అంటున్నారు. టాటా మోటార్స్ భారతదేశంలోనే కాకుండా, అభివృద్ధి చెందుతున్న దేశాలలో కూడా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌కు నాయకత్వం వహించబోతోంది. వారు ఇప్పటికే ముందున్నారు మరియు ఎకానమి ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నారు. అందుకే ఈ షేర్లు తీసుకుంటే మీకు మంచి లాభాలు వస్తాయని సలహా ఇస్తున్నారు రాకేష్. 

మార్కెట్ గురించి...
భారతీయ మార్కెట్ల భవిష్యత్తు గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు రాకేష్. లాంగ్ బుల్లిష్‌ ఉందన్నారు. భారతదేశంలోనే అతిపెద్ద బుల్ రన్‌లలో ఒకటిగా భావిస్తున్నట్టు తెలిపారు. భారతదేశం మారుతోంది మరియు చాలా మంది వ్యక్తులు మార్పు కోసం పెట్టుబడి పెడుతున్నారు.. ఇంకా పెరుగుతుందని అంచనా వేశారు. 

క్రిప్టోపై....
క్రిప్టో కరెన్సీలపై తన అభిప్రాయాన్ని కూడా చెప్పాడు. ఏ ఇతర సంస్థకు కరెన్సీలను జారీ చేసే అధికారాన్ని ఏ సార్వభౌమాధికారి ఎప్పటికీ వదులుకోరని తాను నమ్ముతున్నానని చెప్పాడు. క్రిప్టో ఎప్పుడైనా సాధారణ కరెన్సీగా మారనప్పుడు అందులో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఏముందంటున్నారు.


rakesh jhunjhunwala zee share bofa

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending