ఈ టాటా స్టాక్ నుంచి 9 రోజుల్లో రూ.640 కోట్లు సంపాదించిన రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా

2021-10-13 13:53:54 By VANI

img

రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా పోర్ట్‌ఫోలియో: ఎన్‌ఎస్‌ఈలో టాటా మోటార్స్ షేరు ధర ఈరోజు 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.502.90 కి చేరుకుంది. రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా హోల్డింగ్ స్టాక్ ఒక్కో షేరుకు రూ.42.05 అప్‌సైడ్ గ్యాప్‌తో ఈ రోజు ప్రారంభమై.. ఎర్లీ మార్నింగ్ డీల్స్‌లో 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. గత ఒక నెలలో టాటా స్టాక్ 60 శాతం పెరగడంతో గత ఒక నెల నుంచి ఆకాశాన్నంటుతోంది. అయితే, అక్టోబర్ 2021 లో టాటా మోటార్స్ షేర్ పనితీరును పరిశీలిస్తే.. ఈ ఆటో స్టాక్ కేవలం 9 ట్రేడ్ సెషన్లలో మాత్రమే రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా నికర విలువను దాదాపు 640 కోట్లు పెంచడానికి సహాయపడింది.

 

గత 9 ట్రేడ్ సెషన్లలో ఈ రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా స్టాక్ షేర్ ధర 333.35 (30 సెప్టెంబర్ 2021 న ముగింపు ధర) నుంచి ఒక్కో షేరుకి రూ.502.90కి పెరిగింది. ఈ కాలంలో ఒక్కొక్కటి రూ.169.55 పెరిగింది. టాటా మోటార్స్ షేర్ల పెరుగుదల ఈ నెల 9 ట్రేడ్ సెషన్లలో రిజిస్టర్ అయ్యింది. టాటా మోటార్స్ యొక్క షేర్‌హోల్డింగ్ ప్యాట్రన్ ప్రకారం ఏప్రిల్ నుంచి జూన్ 2021 త్రైమాసికానికి కంపెనీలో రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా 3,77,50,000 షేర్లను కలిగి ఉన్నారు. ఇది టాటా మోటార్స్ మొత్తం చెల్లించిన మూలధనంలో 1.14 శాతం.

 

టాటా మోటార్స్ నుంచి రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా అంతెలా సంపాదించారంటే..

 

గత 9 ట్రేడ్ సెషన్లలో టాటా మోటార్స్ షేర్లు ఒక్కొక్కటిగా రూ.169.55 పెరిగాయి. రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా 3,77,50,000 టాటా మోటార్స్ షేర్లను కలిగి ఉన్నారు. ఈ టాటా షేర్‌లో రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా నికర విలువ రూ.640 కోట్లు (రూ.169.55 x 3,77,50,000) పెరిగింది. రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా జూన్ 2021 త్రైమాసికంలో టాటా మోటార్స్‌లో తన వాటాను తగ్గించుకోకపోతే మరింత సంపాదించి ఉండేవారు. బిగ్ బుల్ టాటా మోటార్స్‌లో తన వాటాను మార్చి 2021 త్రైమాసికంలో 1.29 శాతం నుంచి జూన్ 2021 త్రైమాసికంలో 1.14 శాతానికి తగ్గించుకున్నారు. ఏప్రిల్ నుంచి జూన్ 2021 త్రైమాసికంలో రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా 50 లక్షల టాటా మోటార్స్ షేర్లను విక్రయించారు. టాటా మోటార్స్ తన సెప్టెంబర్ 2021 షేర్‌హోల్డింగ్‌ను ఇంకా ప్రకటించలేదు.


 


Rakesh Jhunjhunwala  Tata Motors  

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending