లిస్టెడ్ కంపెనీల్లో వాటాలు పెంచుకుంటున్న ప్రమోటర్లు

2021-10-22 23:08:59 By Y Kalyani

img

లిస్టెడ్ కంపెనీల్లో వాటాలు పెంచుకుంటున్న ప్రమోటర్లు
షేర్ల ధర పెరుగుతుందా... తగ్గుతుందా
రిటైల్ ఇన్వెస్టర్లు ఈ స్టాక్స్ కొనొచ్చా

 
సెప్టెంబర్ 30 తో ముగిసిన త్రైమాసికంలో బిఎస్‌ఇ 500 ఇండెక్స్‌లో కనీసం 27 కంపెనీల్లో ప్రమోటర్లు తమ హోల్డింగ్‌లను పెంచుకున్నట్లు డేటా చెబుతోంది. ప్రమోటర్ల ద్వారా వాటా పెరుగుదల దలాల్ స్ట్రీట్‌లోని స్టాక్‌కు సానుకూల సంకేతంగా చెబుతారు. సంస్థ భవిష్యత్తు అవకాశాల గురించి అంతర్గత వ్యక్తులు నమ్మకంగా ఉండటం వల్లే స్టేక్ పెంచుకుంటున్నట్టు భావించాలి. అయితే అంతా బాగుంది అనడానికి కూడా లేదంటున్నారు. వాళ్లు కూడా మనుషులే.. అప్పడప్పుడు తప్పులు చేస్తుంటారు. అతి విశ్వాసంతో ఉంటారని కూడా అంటున్నారు. అయితే మెజార్టీ సందర్భాల్లో మాత్రం సానుకూలంగా ఉంటుందన్నది మార్కెట్లో నిర్విదాంశం. 

పెరిగిన వాటిలో కొన్ని...
314 శాతం ర్యాలీతో టాపర్ గా ఉన్న లిస్టెడ్ కంపెనీ బాలాజీ అమీన్స్ ఇండెక్స్‌లో ప్రమోటర్లు తమ వాటాను 53.67 శాతం నుండి 53.70 శాతానికి పెంచుకున్నారు. జిందాల్ స్టెయిన్‌లెస్ లో 58.08 శాతం నుండి 58.87శాతం, వెల్‌స్పన్ ఇండియా 70 శాతం నుండి 70.36 శాతానికి ప్రమోటర్లు తమ హోల్డింగ్‌లను పెంచారు. ఈ కంపెనీల షేర్లు జనవరి 2021 నుండి 123 శాతం నుంచి 135 శాతం వరకు పెరిగాయి. 

నిపుణుల మాటల్లో.. 
ప్రమోటర్ హోల్డింగ్‌లో మార్పులు కూడా స్టాక్ మార్కెట్లో కీలక పరిణామంగా చూడాలి. చాలా సందర్భాల్లో కంపెనీలోని అంతర్గత అంశాల పట్ల వారికి స్పష్టమైన వైఖరి ఉంటుంది కాబట్టి ఫ్యూచర్ పట్ల నమ్మకంతో వాటాలు పెంచుకుంటారు. ఇది ఇన్వెస్టర్లకు సానుకూలంగా తీసుకోవాల్సిన అంశమే. ఇందులో కూడా కంపెనీ నెట్ వర్త్, మరియూ అసెట్, అప్పులు చూసి మరీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో స్వంత కంపెనీ అన్న భావనలో బయటివారికి కనిపించే ప్రమాదాలను విస్మరించి కొంటారు. వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలి. ఒవరాల్ గా ప్రమోటర్ హోల్డింగ్‌లో ఏదైనా పెరుగుదల సానుకూల చర్యగా పరిగణించబడుతుంది. 


shares last week trading bse nifty

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending