గివాడాన్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధమైన ప్రివి.. ఆకాశాన్నంటిన కంపెనీ షేర్లు

2021-08-02 17:06:25 By VANI

img

ప్రివి స్పెషాలిటీ కెమికల్స్ షేర్లు నేడు ఆకాశాన్నంటాయి.  బీఎస్ఈపై ఇంట్రా డే ట్రేడ్‌లో సోమవారం 13 శాతం పెరిగి నూతన గరిష్టం రూ.1799ను తాకాయి. అంతేకాదు.. గడిచిన రెండు రోజుల్లో ఈ కంపెనీ షేర్లు 36 శాతం ర్యాలీ చేశాయి. గివాడాన్ కోసం అత్యంత సుగంధభరితమైన రసాయనాల తయారీ కోసం ఆ కంపెనీతో కలిసి పని చేసేందుకు ప్రివి జాయింట్ వెంచర్ ఒప్పందంపై సంతకం చేసింది. దీంతో ప్రివి షేర్లు మార్కెట్‌లో దూసుకుపోయాయి. 

 

ప్రివి స్పెషాలిటీ కెమికల్స్ (పీఎస్‌సీఎల్) సుగంధ రసాయనాల తయారీ, ఎగుమతి చేయడంలో ప్రఖ్యాతిగాంచిన సంస్థ. గివాడాన్ అనేది స్విట్జర్లాండ్‌లో విలీనం చేయబడిన కంపెనీ. ఇది సుగంధ రసాయనాల తయారీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. గత రెండు రోజుల ర్యాలీతో ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 8.5 శాతం పెరుగుదలతో పోలిస్తే, PSCL స్టాక్ గత మూడు నెలల్లో రెట్టింపు కంటే ఎక్కువ (101 శాతం) పెరిగింది.


Givaudan  Privi Speciality Chemicals 

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending