ఐపీఓకి సిద్ధమవుతున్న పాలసీబజార్.. సెబీకి DRHP దాఖలు

2021-08-02 14:04:43 By VANI

img

PB ఫిన్‌టెక్, మాతృ సంస్థ పాలసీబజార్, పైసాబజార్ సెబీకి ఒక డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) దాఖలు చేసింది. ఐపీఓ ద్వారా రూ.6,017.50 కోట్లను సమీకరించనుంది. రూ.3,750 కోట్ల విలువైన షేర్లను పెట్టుబడిదారులు, రూ.2,267.5 కోట్ల షేర్లను ఇప్పటికే ఉన్న వాటాదారుల నుంచి విక్రయించే ఆఫర్ ఉండనుంది. కాగా.. విక్రయించే పెట్టుబడిదారులలో SVF పైథాన్ II (కేమాన్) లిమిటెడ్ ఉంది. ఇది రూ.1,875 కోట్ల షేర్లను విక్రయిస్తోంది. ఇతర వాటాదారులు రూ .392.50 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తారు.

 

ఇందులో కంపెనీ చైర్మన్, సీఈఓ అయిన యశిష్ దహియా రూ. 250 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. ఐపీఓ నుంచి సేకరించిన నిధులు, పాలసీబజార్, పైసాబజార్‌కే పరిమితం కాకుండా.. బ్రాండ్ విజిబులిటీని, అవగాహనను పెంచడానికి వినియోగిస్తారు. ఆఫ్‌లైన్ ప్రెజెన్స్, వ్యూహాత్మక సముపార్జనలు, పెట్టుబడులు, భారతదేశం వెలుపల ఉనికిని, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలను విస్తరించుకోవాలని కంపెనీ తన DRHPలో పేర్కొంది. కోటక్ మహీంద్రా కేపిటల్, మార్గాన్ స్టాన్లీ, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్, IIFL సెక్యూరిటీస్, జెఫరీస్ ఇండియా ఇష్యూకి లీడ్ మేనేజర్లుగా వ్యవహించనున్నాయి.


PB Fintech  Polocy Bazar  Paisa Bazar  Kotak Mahindra Capital  Morgan Stanley  Citigroup Global Markets India  ICICI Securities  HDFC Bank Ltd IIFL Securities  Jefferies

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending