Carlyle తో డీల్ క్యాన్సిల్ చేసుకున్న PNB

2021-10-14 22:15:14 By Y Kalyani

img

Carlyle తో డీల్ క్యాన్సిల్ చేసుకున్న PNB 
సెబీ అనుమానాలతో పెరిగిన ఒత్తిడి
HDFC మాజీ చీఫ్ ఆదిత్యపురికి షాక్
 

కార్పొరేట్ రంగంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాకు చెందిన ప్రైవేటు ఈక్విటీ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. గత ఏడాది కార్లైల్ నేతృత్వంలోని ఇన్వెస్టర్లతో కుదిరిన రూ. 4,000 కోట్ల నిధుల సేకరణ ఒప్పందాన్ని రద్దు చేసింది PNB హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్  బోర్డు.

గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉండి చట్టపరమైన సమస్యల ఎదర్కొంటున్న నేపథ్యంలో మొత్తానికే డీల్ రద్దు చేసుకుంది.  కార్లైల్ సంస్థ కు చెందిన ప్లూటో ఇన్వెస్ట్‌మెంట్స్ ఓపెన్ ఆఫర్‌ను ఉపసంహరించుకునే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు PNB స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. 

అంతకుముందు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబి PNB హౌసింగ్‌ నుంచి ప్లూటో ఇన్వెస్ట్‌మెంట్స్, జనరల్ అట్లాంటిక్, సాలిస్‌బరీ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఆల్ఫా ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలకు ప్రిఫరెన్షియల్ షేర్ల కేటాయింపులను నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో PNB హౌసింగ్ సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్ వద్ద సవాలు చేసింది. 

డీల్ ఒకే అయి ఉంటే క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ ప్లాన్ ద్వారా యుఎస్ కు చెందిన కార్లైల్ గ్రూప్ లెండర్ లో నియంత్రిత వాటా సొంతంఅయ్యేది. డీల్ రద్దుకు వల్ల హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మాజీ ఎండి మరియు సిఇఒ సుదీర్ఘకాలం భారతీయ బ్యాంక్ సిఇఒగా ఉన్న ఆదిత్య పూరికి కూడా గట్టి షాకే. ఆదిత్యా పూరి నవంబర్ 2020 లో కార్లైల్‌లో అడ్వైజర్ గా చేరారు. ఆయనకు PNBలో షేర్లు తీసుకోవాలనుకున్నారు. పూరి కుటుంబంతో పాటు కార్లైల్ గ్రూప్ దాని అనుబంధ సంస్థలు కలిసి PNB హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలో ఈక్విటీ షేర్లు మరియు వారెంట్‌ల ప్రిఫరెన్షియల్ అలాట్ మెంట్ ద్వారా రూ .4000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలని భావించారు. ఒక్కో షేరుకు రూ .390 చొప్పున చెల్లించాల్సి ఉంది. 


PNB Carlyl Adithya puri

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending