మార్చిలో PMSలు అదరగొట్టాయి తెలుసా

2021-04-14 09:25:44 By Y Kalyani

img

మార్చిలో PMSలు అదరగొట్టాయి తెలుసా

మార్చిలో కరోనావైరస్ సెకండ్ వేవ్ కారణంగా మార్కెట్లు అనిశ్చితికి గురయ్యాయి. అయినప్పటికీ కూడా నిఫ్టీ MoM 1.11 శాతం పెరిగింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 1.83 శాతం, స్మాల్‌క్యాప్ 100 0.79 శాతం గెయిన్ అయ్యాయి. ఇదిలా ఉంచితే పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ స్కీమ్‌లలో PMSలలో 50 శాతం ఇదే కాలానికి నిఫ్టీ కంటే మెరుగ్గా రాణించాయి. 213 పథకాలలో 153 అంటే 72 శాతం మార్చిలో సానుకూల రాబడిని సాధించాయి.
Nine Rivers Capital Aurum స్మాల్ క్యాప్ ఫండ్ 15.6 శాతం గెయిన్ అయింది. Valentis Advisors Rising Star అయితే 11.16 శాతం గెయిన్ అయింది. ఆల్కెమీ అసెంట్ 8.2 శాతం, ఎన్‌జె అసెట్ మేనేజ్‌మెంట్ బ్లూచిప్ 7.18 శాతం, సెంట్రమ్ పిఎంఎస్ మైక్రో 7.16 శాతంతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. టాప్ 10 ఫండ్లలో ఐదు మల్టీక్యాప్ స్పేస్ నుండి, నాలుగు మిడ్ మరియు స్మాల్ క్యాప్ స్పేస్ నుండి ఒకటి థిమాటిక్ ఫండ్ ఉన్నాయి. 
లీడ్ చేసినవి... 119 మల్టీక్యాప్ ఫండ్లలో 53 BSE500ను అధిగమించాయి. వీటిలో ఆల్కెమీ అసెంట్ 8.2 శాతం, ఎన్జె అసెట్ మేనేజ్‌మెంట్ బ్లూచిప్ 7.18 శాతం, అన్విల్ వెల్త్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ లాంగ్ హోల్డింగ్ స్ట్రాటజీ 5.95 శాతం, ఎస్టీ అడ్వైజర్స్ లాంగ్ ఆల్ఫా 5.9 శాతం ఉన్నాయి.
ఇక లార్జ్‌క్యాప్ పథకాలలో 50 శాతం నిఫ్టీని దాటినవి.. అంబిట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కాఫీ కెన్ 4.96 శాతం, అసిత్ సి మెహతా ఇన్వెస్ట్మెంట్ ఇంటర్మీడియట్స్ ఏస్ 15 2.6 శాతం, జెఎమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రోత్ & వాల్యూ 2.44 శాతం ఉన్నాయి. 
లార్జ్ అండ్ మిడ్ క్యాప్ విభాగంలో బొనాంజా గ్రోత్ 3.36 శాతం, కేర్ పోర్ట్‌ఫోలియో మేనేజర్స్ లార్జ్ & మిడ్‌క్యాప్ స్ట్రాటజీ 1.67 శాతం, ఐడిఎఫ్‌సి అసెట్ మేనేజ్‌మెంట్ నియో ఈక్విటీ పోర్ట్‌ఫోలియో 1.43 శాతంతో ఉన్నాయి.
మిడ్‌క్యాప్-ఫోకస్డ్ ఫండ్లలో 48 శాతం నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ను మించిపోయాయి. వీటిలో రైట్ హారిజన్స్ సూపర్ వాల్యూ 4.22 శాతం, మాస్టర్ పోర్ట్‌ఫోలియో సర్వీసెస్ వల్లమ్ ఇండియా డిస్కవరీ 3.68 శాతం మరియు అసిత్ సి మెహతా ఇన్వెస్ట్‌మెంట్ ఇంటర్మీడియట్స్ ఏస్ మిడ్‌క్యాప్ 3.6 శాతంతో గెయిన్ అయ్యాయి. 


market stocks dalalstreet bse nse it shares profit trade PMS shares

Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending