సంచలన నిర్ణయం దిశగా కేంద్రం.. నిజమేనా

2021-09-15 07:57:35 By Y Kalyani

img

సంచలన నిర్ణయం దిశగా కేంద్రం.. నిజమేనా

గత కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. అటు కేంద్రం, ఇటు రాష్ష్ట్రాలు వేస్తున్న పన్నులతో వినియోగదారులపై విపరీతమైన భారం పడుతోంది. ఈ నేపథ్యంలో దీనిని కూడా GST పరిధిలోకి తీసుకరావాలని డిమాండ్లు ఉన్నాయి. 

రాష్ట్రాల అంగీకరిస్తాయా?

ఈ నేపథ్యంలో ట్రోల్‌, డీజిల్‌పై దేశమంతటా ఒకే పన్ను విధించేలా జీఎస్టీ పరిధిలో చేర్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ మొదలైంది. అన్ని పెట్రోలియం ఉత్పత్తులపై దేశవ్యాప్తంగా ఒకే పన్ను అమలుచేసే ప్రతిపాదనను సెప్టెంబర్‌ 17న జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం పరిశీలించి ఒక నిర్ణయాన్ని తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రస్తుతానికి చర్చ మాత్రమే జరుగుతుందని.. ఇందుకు రాష్ట్రాలు అంగీకరించకపోవచ్చని అంటున్నారు. రాష్ట్రాలకు ఉన్న ఆదాయం ఇదొక్కటే. ఇది కూడా GST పరిధిలోకి పోతే.. ఇక రూపాయిల ఆదాయం ఉండదని అంటున్నాయి.

మా చేతిలో లేదన్న కేంద్రం 
ప్రస్తుతం కేంద్రం విధించే ఎక్సయిజు సుంకంపై కూడా రాష్ట్రాలు వ్యాట్‌ను వసూలుచేస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి చేర్చే నిర్ణయాన్ని తీసుకోవాలంటూ జూన్‌ నెలలో కేరళ హై కోర్టు జీఎస్టీ కౌన్సిల్‌ను కోరింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ అంశాన్ని వచ్చే జీఎస్టీ కౌన్సిల్‌ ముందు ఉంచనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మరి సాధ్యమవుతుందా... అసలు చర్చకు వచ్చినా గొప్ప ముందడుగే అంటున్నారు.
గతంలో ఇది రాష్ట్రాలపై ఆధారపడి ఉందని.. మా చేతిలో ఏమీ లేదని ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. కేంద్రం సిద్దంగా ఉన్నా.. రాష్ట్రాల నుంచి కూడా సానుకూలంగా నిర్ణయం రావాలన్నారు. మరి రాష్ట్రాలు అంగీకరిస్తాయా? 


gst nirmal petrol

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending