PAYTM కు డబ్బే డబ్బు..12వేల కోట్లు రానున్నాయి

2021-06-19 21:26:56 By Y Kalyani

img

PAYTM కు డబ్బే డబ్బు..12వేల కోట్లు రానున్నాయి

ఇండియన్ బిగ్గెస్ట్ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం ఈక్విటీల జారీ ద్వారా రూ.12,000 కోట్లు సమీకరించనుంది. షేర్‌హోల్డర్ల అనుమతి ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఈ నెల 12న అసాధారణ వాటాదారుల సమావేశాన్ని నిర్వహించనున్నారు. పేటీఎం వ్యవస్థాపకుడు, ఎండీ విజయ్‌ శేఖర్‌కు ప్రమోటర్‌ గుర్తింపు రద్దు ప్రతిపాదనకూ వాటాదారుల అనుమతి కోరనుంది. నవంబరులో పేటీఎం ఐపీఓకు వచ్చే అవకాశం ఉంది.
ఐపీఓకు ముందు కంపెనీ భారీగా నిధుల సమీకరించాలని నిర్ణయించింది. ప్రమోటర్‌కు ఉండే ప్రత్యేక అధికారాలు, బాధ్యతల విజయ్‌ శేఖర్‌ను నుంచి తప్పించడమూ ఈ వ్యూహంలో భాగమేనని మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు.

పేటీఎమ్ లో వాటాలు...
విజయశేఖర్‌కు 14.61 వాటా
చైనా టెక్నాలజీ అలీబాబాకు చెందిన యాంట్‌ 29.71 శాతం
సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌కు 19.63 శాతం
సైఫ్‌ పార్ట్‌నర్స్‌కు 18.56 శాతం
ఇంకా ఏజీహెచ్‌ హోల్డింగ్స్‌, టీ రోవ్‌ ప్రైస్‌, డిస్కవరీ క్యాపిటల్‌, బెర్క్‌షైర్‌ హ్యాత్‌వేకు కలిపి 10 శాతం వరకు వాటాలున్నాయి.
మొత్తానికి IPOలో భాగంగా మార్పులు రానున్నాయి. 


paytm ipo profit bse nse trading vijay sharma