స్టాక్ మార్కెట్లో బ్రోకర్ గా దుమ్మురేపుతున్న PAYTM

2021-08-02 22:31:22 By Y Kalyani

img

స్టాక్ మార్కెట్లో బ్రోకర్ గా దుమ్మురేపుతున్న PAYTM

డిజిటల్ పేమెంట్ రంగంలో తిరుగులేని మార్కెట్ వాటా దక్కించుకున్న Paytm మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. గత ఏడాది కొత్తగా మొదలుపెట్టిన స్టాక్ ఇన్వెస్టర్ సర్వీసుల్లో కూడా అధ్బుతాలు నమోదు చేసింది. వార్షిక నివేదిక ప్రకారం డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ Paytm మనీ FY21 లో డిమాట్ అకౌంట్ హోల్డర్లు సగటున రూ. 70,000 పెట్టుబడిని పెట్టినట్టు చెబుతోంది. Paytm మనీ మార్చి 31, 2021 వరకు 2.1 లక్షల డీమ్యాట్ ఖాతాలను తెరిచింది. ఇందులో 80 శాతం మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే కావడం విశేషం. 
గత ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్టర్లు సగటున నెలకు 10 లావాదేవీలు జరిపారు మరియు ఖాతాలో రూ. 46,000 విలువైన స్టాక్‌లను కలిగి ఉన్నారు. ఇందులో మహిళా పెట్టుబడిదారుల సంఖ్య కూడా రెట్టింపు అయినట్లు కంపెనీ గుర్తించింది. మొత్తం యూజర్ బేస్‌లో దాదాపు 44 శాతం మంది మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటకతో సహా ఐదు రాష్ట్రాలకు చెందినవారున్నారు. మొత్తం డీమ్యాట్ అకౌంట్ హోల్డర్లలో 64 శాతానికి పైగా మ్యూచువల్ ఫండ్స్‌లో, 28 శాతానికి పైగా ఈక్విటీలో మరియు మిగిలిన వారు డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టారు. మ్యూచువల్ ఫండ్స్‌లో యాక్సిస్ బ్లూచిప్ ఫండ్ (గ్రోత్ ప్లాన్)లో దాదాపు 1.2 లక్షల మంది వినియోగదారులు పెట్టుబడి పెట్టారు. మొత్తం 80 శాతం మంది వినియోగదారులు SIP ని ఎంచుకున్నారు. నివేదిక ప్రకారం, ఈటీఎఫ్‌లలో 25 శాతానికి పైగా ఈక్విటీ వినియోగదారులు సగటున రూ .28,834 పెట్టుబడి పెట్టారు. 


paytm paytm money stocks tradings

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending