ఇండియా స్టాక్ మార్కెట్లో లక్ష కోట్లు దాటిన పీ నోట్స్

2021-11-25 22:12:04 By Y Kalyani

img

ఇండియా స్టాక్ మార్కెట్లో లక్ష కోట్లు దాటిన పీ నోట్స్ 
43 నెలల గరిష్టస్థాయిలో చేరింది

దేశీయ స్టాక్ మార్కెట్లోకి పార్టీసపేటరీ నోట్స్ P Notes ద్వారా ఇన్వెస్ట్ మెంట్ రికార్డు స్థాయికి చేరింది.  అక్టోబర్ చివరి నాటికి ఇది రూ.1.02 లక్షల కోట్లకు చేరినట్టు మార్కెట్ ప్రకటించింది. పీ నోట్స్ సాధారణంగా రిజిస్టర్ చేసుకోకుండా ఇండియామార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న విదేశీ రిటైల్ పెట్టుబడి దారులకు రిజిస్టర్డ్ ఫారిన్ పోర్ట్ పోలియో ఇన్వెస్టర్స్ -FPIలు పీ నోట్స్ జారీ చేస్తారు. వాళ్లు మన దేశీయ స్టాక్ మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తారు. 
వాళ్లు మార్కెట్లో రిజిస్టర్ కాకుండా ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ.. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలుపాటించాల్సి ఉంటుంది. తాజాగా వచ్చిన డేటా ప్రకారం అక్టోబర్ చివరి నాటికి భారతీయ మార్కెట్లలో ఈక్విటీ, డెట్ మరియు హైబ్రిడ్ సెక్యూరిటీలలో పి-నోట్ పెట్టుబడుల విలువ రూ.1,02,553 కోట్లుగా ఉంది. 2018 మార్చిలో ఒకసారి 1,06,403 కోట్ల రూపాయల పి-నోట్స్ పెట్టుబడి చేరింది. మళ్లీ 43 నెలల తర్వాత ఇదే అత్యధిక స్థాయిగా చెబుతున్నారు.
P నోట్ల ద్వారా మొత్తం పెట్టుబడి అక్టోబర్‌లో రూ. 5,000 కోట్లకు పైగా పెరిగి కొత్త గరిష్ట స్థాయి రూ.1.02 లక్షల కోట్లకు చేరుకుందని సెబీ-నమోదిత PMS తెలిపింది. ఈక్విటీల్లో రూ.93,213 కోట్లు, డెట్‌లో రూ.8,885 కోట్లు, హైబ్రిడ్‌ సెక్యూరిటీల్లో రూ.455 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఈ ఏడాది సెప్టెంబరు చివరి నాటికి పెట్టుబడుల స్థాయి 97,751 కోట్లు, ఆగస్టు చివరి నాటికి రూ.97,744 కోట్లుగా ఉంది. 


p-notes p notes investiments trading

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending