తగ్గేదే లే.. 10వేల కోట్ల IPOకు వస్తామంతే అంటున్న OYO

2021-11-25 22:24:20 By Y Kalyani

img

తగ్గేదే లే.. 10వేల కోట్ల IPOకు వస్తామంతే అంటున్న OYO
PAYTM ఫెయిల్యూర్ అనుభవంతో సంబంధం లేదు
మా లెక్క మాది అంటున్న సంస్థ
90వేల కోట్ల వాల్యేషన్ లెక్కలేస్తున్న సంస్థ

హాస్పిటాలిటీ రంగంలో ఉన్న దిగ్గజం  OYO తగ్గేది లేదంటోంది. ఇటీవల స్టాక్ మార్కెట్లో భారీ అంచనాల మధ్య వచ్చి లిస్టింగ్ డే నాడు ఇబ్బందులు పడ్డ పేటీఎమ్ సంగతి వేరు.. మా లెక్క వేరే అంటోంది కంపెనీ. వాల్యేషన్ నుంచి IPO దాకా ఎందులోనూ తగ్గేది లేదంటోంది. ఇందులో భాగంగా 2022లో తొలి మూడు నెలల్లోనే ఐపీఓకు వస్తామంటోంది. 

చెబుతున్న లెక్కలివే...
మొత్తం రూ.9వేల కోట్లకు పైగా IPO ద్వారా నిధులు సమీకరిస్తామంటోంది. వాస్తవానికి 2021లోనే లిస్టింగ్ కావాల్సి ఉన్నా కూడా నియంత్రణసంస్థ నుంచి అనుమతులు ఆలస్యం కావడంతో ఆగిపోయింది. ప్రస్తుతం కంపెనీ తన వాల్యేషన్ విషయంలో కూడా తగ్గనంటోంది. IPO కోసం 10-12 బిలియన్ల డాలర్లుగా లెక్కకడుతోంది. అంటే ఇండియా కరెన్సీలో 90వేల కోట్లకు పైమాటే. ఇదే వాల్యుయేషన్‌కు కట్టుబడి ఉన్నామంటోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ స్టార్టప్‌లో 9.6 బిలియన్ల డాలర్ల వాల్యేషన్ వద్ద నిధులు సమీకిరించింది.  దాదాపు 200 మిలియన్ డాలర్ల ప్రీ-ఐపిఓ ప్లేస్‌మెంట్ రౌండ్ కూడా ఉంది. 
OYO యొక్క డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ DRHP ఈ సంవత్సరం అక్టోబర్‌లో దాఖలు చేసింది. SEBI ఇంకా IPOకి అనుమతులను జారీ చేయలేదు. ఈ ఆఫర్‌లో తాజాగా రూ. రూ. 7,000 కోట్లు లేదా ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ. 1,430 కోట్లు సమీకరిస్తుందట. 

వ్యాపారం ఫర్వాలేదు..
హాస్పిటాలిటీ రంగంపై కోవిడ్-19 భారీగా ప్రభావం చూపింది. అయితే వ్యయ-తగ్గింపు చర్యల కారణంగా నష్టాలు తగ్గించుకుంది. స్థూలంగా  మార్జిన్ FY20లో 9.7 శాతం నుండి FY21లో 33.2 శాతానికి మెరుగుపడిందని కంపెనీ తన ఫైలింగ్‌లో పేర్కొంది. FY20 నుండి FY21 వరకు EBITDA నష్టాలలో 79 శాతం తగ్గింపు.


oyo ipo hotels ipo news

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending