ఈ స్టాక్ దూకుడు కంటిన్యూ అవుతుందా

2021-04-07 23:14:40 By Y Kalyani

img

ఈ స్టాక్ దూకుడు కంటిన్యూ అవుతుందా

టైటాన్ షేర్ ధర బుధవారం రూ.1,561కు చేరుకుంది. కరోనా వైరస్ ప్రభావం తగ్గడం, వ్యాపారం బలంగా ఉండటంతో టైటాన్ ఆదాయం పెరిగింది. దీంతో పాటు షేరు ధర కూడా ఆకాశంవైపు చూస్తోంది. టైటాన్ తరచుగా ఏస్ ఇన్వెస్టర్ అయిన రాకేశ్ ఇష్టమైన స్టాక్ అని పిలుస్తారు. ఆయన కుటుంబానికి ఇందులో 5.32శాతం వాటా ఉంది. మార్చి 2020తో పోల్చితే టైటాన్ ఆదాయ వృద్ధి 60శాతంగా ఉంది. పండుగ సీజన్ అయిన క్యూ 3 లో అత్యుత్తమ ఆదాయాన్ని చూసింది. క్యూ4లోనూ మంచి లాభాలు రిపోర్ట్ చేసింది. 
జనవరి-మార్చి త్రైమాసికంలో బంగారం ధరలు గణనీయంగా తగ్గడం ఆభరణాల విభాగానికి వినియోగదారుల డిమాండ్‌ కూడా కీలకంగా మారింది. బిజినెస్ టు బిజినెస్ ఆర్డర్లు ఈ త్రైమాసికంలో 10శాతంగా ఉంది. మొత్తం ఆదాయ వృద్ధి సంవత్సరానికి 70శాతంగా ఉంది.  26 కొత్త తానిష్క్ దుకాణాలను కంపెనీఏర్పాటు చేసింది. అటు టైటాన్ గడియారాల విభాగం త్రైమాసికంలో మొదటి రెండు నెలల్లోనే దాదాపు 90శాతం బిజినెస్ రికవరీ రేటును సాధించింది. టైటాన్ ఐ వేర్ డివిజన్ మార్చి త్రైమాసికంలో 20శాతం రెవిన్యూ గ్రోత్ సాధించింది. దుబాయ్ బోటిక్ అంతర్గత అంచనాలను మించిపోయింది. దేశీయ విభాగాలతో పాటు గ్లోబల్ బిజినెస్ కూడా కోలుకుంది. మొత్తానికి కంపెనీలోని అన్నివిభాగాలు మళ్లీ మెరుగ్గా రాణిస్తున్నాయి. దీంతో స్టాక్ కూడా దూసుకుపోతుంది. 

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending