కొత్త నోట్లపై ఆశలు వదులుకోండి.. క్లారిటీ ఇచ్చిన నిర్మలా

2021-07-26 23:27:00 By Y Kalyani

img

కొత్త నోట్లపై ఆశలు వదులుకోండి.. క్లారిటీ ఇచ్చిన నిర్మలా

కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయింది. ప్రజలకు డబ్బులకు చేతికి ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. అమెరికా తరహాలో లిక్విడ్ సాయం అందించాలని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టి ప్రజలకు కూడా సాయం అందించడానికి కొత్త కరెన్సీ నోట్ల ముద్రణ చేపడుతున్నారా అని పార్లమెంటులో ఎంపీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పేద ప్రజలు, చిరు వ్యాపారులకు పంపిణీ చేయాలని విపక్షాలు సహా పలువురు ఆర్థిక నిపుణులు కేంద్రానికి సూచిస్తున్న నేపథ్యంలో ఆలోచన ఏమైనా ఉందా అంటూ ఆరా తీశారు ఎంపీలు. అయితే కొత్త నోట్ల ముద్రణ అంశంపై కేంద్ర ప్రభుత్వం సృష్టత ఇచ్చింది. కొత్త నోట్లు ముద్రించే ఆలోచ‌నే ప్ర‌భుత్వానికి లేద‌ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో చెప్పేశారు. నోట్ల ముద్రణకు సంబంధించి ఎంపీ మాలా రాయ్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని ఇప్పటి సంక్షోభానికి కొత్త నోట్ల‌ను ముద్రించ‌డం పరిష్కారం కాద‌ంటున్నారు. లాక్‌ డౌన్ ఆంక్షల సడలింపులతో క్రమంగా పరిస్థితులు సర్దుకుంటున్నాయట.


new notes no plans money currency

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending