నో లాక్ డౌన్.. ఓన్లీ నైట్ కర్ఫ్యూ

2021-04-08 23:35:51 By Y Kalyani

img

నో లాక్ డౌన్.. ఓన్లీ నైట్ కర్ఫ్యూ

కరోనా భయంకరంగా వ్యాప్తిస్తోంది. అయినా దేశంలో లాక్ డౌన్ ఆలోచన లేదని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు వెల్లడించారు. సెకెండ్ వేవ్‌పై ఆయన.. కరోనాతో పోరాటం చేసేందుకు సలహాలు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రులను కోరారు. అయితే లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్‌గఢ్, పంజాబ్, వంటి పలు రాష్ట్రాల్లో గరిష్ఠ స్థాయిని మించి రోజువారి కేసులు నమోదవుతున్నాయన్నారు. ప్రజలు నిర్లక్ష్యంగా ఉన్నారు. వారిలో జాగ్రత్తలు తీసుకునే ఆలోచన రావాలన్నారు. ప్రభుత్వాల్లో కూడా అలసత్వం పెరిగిందన్నారు. పెద్ద ఎత్తున కరోనా టెస్టులు చేయాలని, ఈ క్రమంలో కేసుల సంఖ్య పెరిగినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రులతో చెప్పారు. టీకాలు వృథా కాకుండా కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా వచ్చిన ఓ వ్యక్తిని గుర్తించి వారికి దగ్గరగా ఉండే 30 మందిని ట్రేస్ చేయాలన్నారు. 
రోజుకు 40లక్షల మందికి టీకాలు వేస్తున్న దేశంగా మారామన్నారు. 45 ఏళ్లు దాటిన వారందరికీ టీకాలు వేస్తామన్నారు. నైట్ కర్ప్యూలు ప్రమోట్ చేసి కరోనా వ్యాప్తిని అరికట్టాలన్నారు. లాక్ డౌన్ కు మెజార్టీ సీఎంలు కూడా అంగీకరించలేదు. ఆర్ధికంగా ఇప్పడిప్పుడే కోలుకుంటున్న సమయంలో లాక్ డౌన్ సరైన నిర్ణయం కాదన్నారు. 

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending