పైకా..కిందకా..? అప్ అండ్ డౌన్ మధ్యలో మెటల్ బ్యాంక్ స్టాక్స్ సయ్యాట !

2021-05-04 11:52:03 By Anveshi

img


స్టాక్ మార్కెట్లలో ఊగిసలాట ధోరణి కన్పిస్తోంది. నిఫ్టీ, సెన్సెక్స్ జోరు కొనసాగుతున్నట్లు  కన్పిస్తున్నా..ఎక్కడ ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకుంటుందో ఇదమిద్దంగా చెప్పలేని పరిస్థితి. ఐతే ఈ మధ్యలో బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్, మెటల్ ఇండెక్స్ స్టాక్స్ మంచి ర్యాలీ కనబరుస్తున్నాయ్

 

నిఫ్టీ బ్యాంక్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 107.69 పాయింట్లు కంట్రిబ్యూట్ చేస్తూ 2.40శాతం పెరిగి రూ.359.10 వద్ద ట్రేడ్ అయ్యాయ్. ఇంట్రాడేలో ఎస్‌బిఐ రూ.360 వరకూ పెరిగింది 

ఐసిఐసిఐ బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీని  76.09 పాయింట్ల మేర పుష్ చేస్తూ 2శాతం పెరిగి రూ.604.50 వద్ద ట్రేడ్ అయింది.కోటక్ మహీంద్రా బ్యాంక్ 69.07 పాయింట్ల కాంట్రిబ్యూషన్‌తో 2శాతం పెరిగి రూ.1754.45 వద్ద ట్రేడ్ అయింది. ఈ స్టాక్ డే హై ప్రైస్ రూ.1764 యాక్సిస్ బ్యాంక్ 54.58 వెయిటేజీతో 2శాతం పెరిగి రూ.716.75 వద్ద , ఇంట్రాడేలో రూ.718 ప్రైస్ వద్ద ట్రేడ్ అయింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ 36.44 పాయింట్ల వెయిటేజీ పార్టిసిపేట్ చేసి 8శాతం వరకూ పెరిగి రూ.37.20  వద్ద ట్రేడ్ అయింది

 

ఇక మెటల్ సెక్టార్ ఇండెక్స్ దాదాపు 2శాతం పెరగగా, వాటిలో టాప్ 5 కంపెనీల కంట్రిబ్యూషన్ చూస్తే,
సెయిల్ షేరు  80.90 పాయింట్ల కాంట్రిబ్యూషన్‌తో  5శాతం లాభపడి రూ.135.70 వద్ద డే హై నమోదు చేసి తర్వాత 134.80 దగ్గర ట్రేడ్ అయింది .58.04 వెయిటేజీ కాంట్రిబ్యూషన్‌తో  టాటా స్టీల్ షేర్లు  రూ.1084.15 వద్ద ట్రేడ్ అయ్యాయ్.మెటల్ సూచీ ర్యాలీలో హిందాల్కో వెయిటేజీ 40.75 కాగా షేర్లు రూ.376.75 వద్ద కోల్ ఇండియా వెయిటేజీ 38.88 కాగా  రూ.134.60 వద్ద ట్రేడ్ అయ్యాయ్.ఎన్ఎండిసి 29.66 వెయిటేజీతో రూ.162.80వద్ద ట్రేడ్ అయ్యాయ్

హింద్ జింక్ మాత్రం 24.44వెయిటేజీ డ్రాగ్ చేస్తూ రూ.295.60 వద్ద నష్టాల్లో ట్రేడయింది

 

ఇదే సమయానికి నిఫ్టీ 58 పాయింట్ల లాభంతో 14692 పాయింట్ల వద్ద, సెన్సెక్స్ 180 పాయింట్ల లాభంతో
48898 పాయింట్ల వద్ద ట్రేడ్ అయ్యాయ్

 

( పై రేట్లన్నీ స్టోరీ పబ్లిష్ అయిన సమయానికి ఉన్నవి.గమనించగలరు)


NIFTY SENSEX BANK METAL TATA STEEL SAIL AXIS KOTAK MAHINDRA ICICI SBI

Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending