పాజిటివ్ ఓపెనింగ్ !

2021-05-04 10:09:12 By Anveshi

img

నిన్నటి పాజిటివ్ స్వింగ్ తర్వాత మంగళవారం కూడా స్టాక్ మార్కెట్లు పాజిటివ్‌గా ప్రారంభం అయ్యాయ్. గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నా మన మార్కెట్లు మాత్రం ఎర్లీ ట్రేడ్‌లో  సానుకూలంగానే స్పందించాయనే చెప్పాలి

నిఫ్టీ బ్యాంక్, మెటల్ స్టాక్స్  ప్రధానంగా మార్కెట్లను ముందుండి నడిపిస్తుండగా, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, హెల్త్‌కేర్, ఐటీ,టెక్, కేపిటల్ గూడ్స్ స్టాక్స్‌లో కొనుగోళ్ల సందడి నెలకొంది. ఒక్క ఎఫ్ఎంసిజి సెక్టార్‌లో మాత్రం ప్రాఫిట్ బుకింగ్‌తో ‌ ఫ్లాట్‌ ట్రేడింగ్ కన్పిస్తోంది

హిందాల్కో, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా మోటర్స్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్‌జిసి  3.50 నుంచి 2శాతం వరకూ లాభపడ్డాయ్

నిఫ్టీ టాప్ లూజర్లలో హెచ్‌యుఎల్, టైటన్, రిలయన్స్, సన్‌ఫార్మా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వంటి హెవీ వెయిట్ స్టాక్స్ ఒకటిన్న రనుంచి అరశాతం వరకూ నష్టపోయాయ్


ప్రస్తుతం నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 14665 పాయింట్ల దగ్గర, సెన్సెక్స్ 72 పాయింట్ల లాభంతో 48791 పాయింట్ల వద్ద ట్రేడ్ అయ్యాయ్


Nifty sensex trend sideways 14000 14500 14800 15100

Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending