ఈ దూకుడూ సాటెవ్వరూ..! ఆల్‌టైమ్ రికార్డ్ క్లోజింగ్ @15800కి అరపాయింట్ తక్కువ !

2021-06-11 16:21:24 By Anveshi

img

స్టాక్ మార్కెట్లు వరసగా నాలుగో వారం కూడా మంచి లాభాలతో ముగించాయ్. నిఫ్టీ ఆల్ టైమ్ రికార్డ్ హై లెవల్ వద్ద ముగిసింది. ఒక్క అరపాయింటు తక్కువగా 15800 పాయింట్ల వద్ద నిఫ్టీ క్లోజైంది. 61 పాయింట్లలాభంతో 15799.35  పాయింట్ల వద్ద ముగిసింది. అలానే సెన్సెక్స్ కూడా 174 పాయింట్లు లాభపడి 52474 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది

మార్కెట్లలో ఆరంభం నుంచి ముగింపు వరకూ మంచి గ్యాలప్ కన్పించగా, మధ్యాహ్నం సెషన్ తర్వాత రియాల్టీ కేపిటల్ గూడ్స్‌లో సెల్లింగ్ ప్రెజర్ చోటు చేసుకుంది.

 

ఐతే నిఫ్టీ బ్యాంక్ లాభాల స్వీకరణకు గురైంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ ఎక్కువగా నష్టపోయింది. దీనికి కారణం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ విభాగంలో కార్లైల్  పీఈ సంస్థ పెట్టిన పెట్టుబడిపై సెబీ కన్నేయడమే. ఇందులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సెబీ స్కాన్ చేయడం ప్రారంభమైంది. 

 

మిగిలిన రంగాల్లో  ఐటి ఆయిల్ అండ్ గ్యాస్, టెక్ షేర్లు లాభపడగా,మెటల్ హెల్త్ కేర్ స్టాక్స్‌లో ర్యాలీ చోటు చేసుకుంది. కేపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసిజి స్టాక్స్ నష్టాల పాలు కాగా, స్మాల్ అండ్ మిడ్‌క్యాప్ స్టాక్స్‌కి కొనుగోళ్ల మద్దతు లభించింది

 

నిఫ్టీ టాప్ 5 గెయినర్లలో టాటా స్టీల్, కోల్ఇండియా,జెఎస్ డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్,హిందాల్కో 3.94 నుంచి 2.01శాతం లాభపడ్డాయి లూజర్లలో లార్సెన్ అండ్ టుబ్రో, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, దివీస్ ల్యాబ్స్ 1 నుంచి .0.87శాతం నష్టపోయాయ్

 

52 వారాల గరిష్టాన్ని అందుకున్న షేర్లోల ఈక్లర్క్స్ సర్వీసెస్, ఎన్‌బిసిసి, థైరోకేర్ టెక్నాలజీస్,ఐసిఐసిఐ సెక్యూరిటీస్, లక్స్ ఇండస్ట్రీస్,జిందాల్ స్టెయిన్‌లెస్ స్టీల్,కోల్ ఇండియా 20 నుంచి 3.93శాతం వరకూ లాభపడ్డాయ్ 


nifty 15800 sensex rally 52 weeks high 52474 points telugu closing report

Expert's View


నేను వేసుకున్న కోటు రంగు , రానున్న రోజుల్లో మార్కెట్ల రంగు ఇదేనా ?

Trending