మార్కెట్లలో తిరిగి ఉత్సాహం..!15800 పాయింట్లపైకి నిప్టీ..! 17%జంప్ చేసిన ఐడిఎఫ్‌సి, ఇంట్రాడేలో రూ.250 లాభపడిన బజాజ్ ఫైనాన్స్‌

2021-07-22 11:03:23 By Anveshi

img

స్టాక్ మార్కెట్లలో గత రెండు సెషన్ల నష్టాలను పూడ్చుకునే ఉత్సాహం కన్పిస్తోంది. దీంతో నిప్టీ 15812 పాయింట్ల వరకూ వెళ్లగా  సెన్సెక్స్ 52825 పాయింట్లకిపైగా ఎగసింది. రెండు సూచీలు దాదాపు ఒకటిన్నరశాతం వరకూ పెరిగాయి. ప్రధానంగా మార్కెట్ల లాభాలకు బ్యాంక్ నిప్టీ, ఐటీ ప్యాక్‌ బీభత్సంగా పెరగడమే కారణంగా కన్పిస్తుండగా, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో కొనుగోళ్లు వెర్రెత్తేశాయ్. ఆటో స్టాక్స్ దూసుకుపోతుండగా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగం ఇవాళ్టి అన్ని సూచీలకంటే  ఎక్కువగా లాభపడుతోంది. ఎఫ్ఎంసిజి, హెల్త్,ఆయిల్ అండ్ గ్యాస్ ఇలా ఒకటేమిటి అన్ని రంగాల ఇండెక్స్‌లూ లాభాల బాటలో  దూసుకెళ్తున్నాయ్. పిఎస్ఈ సూచీ  ఏకంగా ఒకటిన్నరశాతం పెరగడం విశేషం.

 

ఇక టాప్ గెయినర్ల విషయానికి వస్తే,  బజాజ్ ఫైనాన్స్ రిజల్ట్స్ తర్వాత భారీగా ర్యాలీ చేసింది. ఇంట్రాడేలో 5శాతం వరకూ  లాభపడి రూ.6198 ధరకి చేరింది. ఈరోజు కనుక ఇదే జోరు కొనసాగితే, గత 52 వారాల గరిష్టమైన రూ.6342.80 రేటుని  అధిగమించడం ఖాయం

 

మిగిలిన గెయినర్లలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, టాటా స్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్ 3.50 నుంచి 2.60శాతం వరకూ  లాభపడ్డాయ్. లూజర్లలో ఏషియన్ పెయింట్స్, ఐషర్ మోటర్స్, హీరోమోటోకార్ప్, సిప్లా, అదానీ పోర్ట్స్ ఒకటి నుంచి  అరశాతానికిపైగా నష్టపోయాయ్

 

మరో ప్రభుత్వరంగ బ్యాంక్ స్టాక్ ఐడిఎఫ్‌సి , ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ నుంచి వైదొలగేందుకు ఆర్బీఐ అనుమతి దక్కడంతో  విపరీతంగా పెరిగింది. ఇంట్రాడేలో 17శాతానికిపైగా లాభపడి రూ.62.60 ధరకి చేరింది. ఇది ఈ స్టాక్‌కి సరికొత్త 52 వారాల  గరిష్టం. ఇదే కౌంటర్‌లో వాల్యూమ్స్ కూడా భారీగా నమోదు అవుతుండటం విశేషం. ఇదే సెగ ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్‌కి కూడా  తాకి ఇంట్రాడేలో దాదాపు మూడుశాతం పెరిగి రూ.52.70కి చేరింది

 

ప్రస్తుతం నిఫ్టీ 15799 పాయింట్ల  వద్ద, సెన్సెక్స్ 52800 పాయింట్ల వద్ద  ట్రేడ్ అయ్యాయ్ 
 


nifty idfc first bank bajaj finance 52 weeks high price