పాజిటివ్ ఓపెనింగ్..! వరసగా రెండో రోజూ మెటల్, ఫార్మా షేర్ల హవా..!

2021-06-10 10:37:14 By Anveshi

img


గురువారం మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావడమే కాకుండా, ప్రారంభమైన గంట తర్వాత తిరిగి డే హై మార్క్‌ని అధిగమించేందుకు నిఫ్టీ ప్రయత్నిస్తోంది. 15714 పాయింట్ల వరకూ వెళ్లిన నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీ, ఐటీ,స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ సపోర్ట్ ఇస్తున్నాయ్. హెల్త్ కేర్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో హెవీ ర్యాలీ చోటు చేసుకుంటుంది.ఒక్క పిఎస్ఈ, ఎఫ్ఎంసిజి షేర్లలో మాత్రమే బయింగ్ సపోర్ట్ తక్కువగా ఉంది

 

మెటల్ షేర్లలో ఎన్ఎండిసి,సెయిల్, వెల్ స్పన్ కార్పొరేషన్, జెఎస్‌డబ్ల్యూ, మొయిల్, టాటా స్టీల్, నాల్కో 3 శాతం నుంచి ఒకటిన్నరశాతం వరకూ పెరిగి ట్రేడర్లలో ఉత్సాహం పంచాయ్

 

నిఫ్టీ గెయినర్లలో బజాజ్ ఫైనాన్స్, దివీస్ ల్యాబ్స్, జెఎస్ డబ్ల్యూ స్టీల్, శ్రీసిమెంట్స్, టాటా స్టీల్ రెండున్నర నుంచి 1.75శాతం వరకూ పెరిగాయి. లూజర్లలో ఐటీసి బజాజ్ ఆటో ఐషర్ మోటర్స్, ఏషియన్ పెయింట్స్, హీరో మోటోకార్ప్ ఒకటి నుంచి అరశాతం వరకూ నష్టపోయాయ్ 

 

మొత్తం మీద స్టాక్ మార్కెట్లలో ఇవాళ అన్ని రంగాల షేర్లూ పాజిటివ్‌గా ట్రేడవుతుండటం ప్లస్ పాయింట్‌గా చూడాలి


nifty gainers metal pharma rally 15700 telugu

Expert's View


నేను వేసుకున్న కోటు రంగు , రానున్న రోజుల్లో మార్కెట్ల రంగు ఇదేనా ?

Trending