ర్యాలీకి ఇప్పుడో బ్రేక్ మిత్రమా..!

2021-03-04 09:23:38 By Anveshi

img

స్టాక్ మార్కెట్లు మూడు సెషన్ల తర్వాత ఇప్పుడో బ్రేక్ తీసుకున్నట్లు కన్పిస్తోంది. ఓపెనింగ్‌లోనే నిఫ్టీ  193 పాయింట్లు నష్టపోగా,సెన్సెక్స్ 681 పాయింట్లు కోల్పోయింది.అంతర్జాతీయ మార్కెట్లు ఎక్కువశాతం నష్టాలతో ట్రేడవడంతో పాటు ప్రాఫిట్ బుకింగ్ కూడా దీనికి ప్రధానకారణాలుగా అర్ధమవుతోంది.నాస్‌డాక్స్ రెండున్నరశాతానికిపైగానే నష్టపోయింది. ఇతర ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లోనే ఉన్నాయ్.

నిఫ్టీ 196 పాయింట్ల నష్టంతో 15049 పాయింట్ల వద్ద ట్రేడవగా, సెన్సెక్స్ 716 పాయింట్లు నష్టపోయి 50728 పాయింట్ల వద్ద ట్రేడ్ అయ్యాయ్.

ట్రేడింగ్ ఓపెన్ అయ్యే సమయానికి గెయినర్ల లిస్ట్‌లో ఏ స్టాకూ కన్పించలేదు. నిఫ్టీ లూజర్లుగా బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసిఐసిఐ బ్యాంక్, జెఎస్‌డబ్ల్యూ స్టీల్,
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్,  ఇండస్ ఇండ్ బ్యాంక్ వరసగా, 2.67శాతం, 2.30శాతం, 2.72శాతం, 2.18శాతం, 1.86శాతం నష్టపోయాయ్.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌గా రిలయన్స్, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్,టాటా మోటర్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ట్రేడవుతున్నాయ్. ఈ కౌంటర్లలో వాల్యూమ్ భారీగా నమోదు అవుతోంది

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending