బుల్క్స్ కి బ్రేక్..! 15700 మార్క్ కోల్పోయిన నిఫ్టీ..! ఫెడ్ ఎఫెక్ట్‌తో నెక్ట్స్ జరగబోయేది ఇదేనా?

2021-06-17 16:27:36 By Anveshi

img

దాదాపు నెల రోజుల తర్వాత నిఫ్టీకి వరసగా రెండు సెషన్లు నష్టాలతో ముగింపు దొక్కింది. నిన్నటి 101 పాయింట్లకు మరో 76 పాయింట్ల నష్టం తోడు కావడంతో 15700 మార్క్ కోల్పోయింది. దీంతో ఆల్ టైమ్ గరిష్టాలను సృష్టించిన తర్వాత నాలుగు సెషన్లు 15700 పాయింట్లపైనే క్లోజవగా తొలిసారి నిఫ్టీ 15700కి దిగువగా 15691 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 178 పాయింట్లు నష్టపోయి 52323పాయింట్ల వద్ద ముగిసింది

 


నిఫ్టీ బ్యాంక్, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ , ఆటో, రియాల్టీ, ఫైనాన్షియల్ స్టాక్స్‌లో అమ్మకాలు కొనసాగగా, ఐటీ , ఎఫ్ఎంసిజి సెక్టార్ మాత్రం వరసగా రెండో రోజూ లాభపడ్డాయ్.ఆఖరి అరగంటలో వచ్చిన బయింగ్ సపోర్ట్‌తో ఐటీ స్టాక్స్ ఇవాళ మెరిశాయ్. 


టిసిఎస్ 1.64శాతం
ఇన్ఫోసిస్ 1.39శాతం
టెక్ మహీంద్రా 1.30శాతం
విప్రో 0.72శాతం
హెచ్‌సిఎల్ టెక్ 0.57శాతం
 మైండ్ ట్రీ 0.54శాతం లాభపడ్డాయ్
బహుశా వీటి ర్యాలీకి రూపాయి మారకపు విలువలో భారీగా తేడా రావడమే కారణమై ఉండొచ్చంటున్నారు

 

నిఫ్టీ గెయినర్లలో అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, టిసిఎస్,టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, 1.78శాతం  నుంచి 1.18శాతం లాభపడ్డాయి. టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్‌కి ఇది వరసగా రెండో లాభాల సెషన్ కావడం గమనార్హం. ఇక టాప్  లూజర్లలో అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందాల్కో, ఐషర్ మోటర్స్ 8.46శాతం నుంచి 2.46శాతం వరకూ నష్టపోయాయ్. అదానీ పోర్ట్స్‌కి ఇది వరసగా నాలుగో నష్టాల సెషన్. ఈ కౌంటర్‌లో అనుకున్నదానికంటే ఎక్కువగా సెల్లాఫ్  జరుగుతుండటం గమనార్హం. ట్రేడ్ టూ ట్రేడ్ సెగ్మెంట్లో ఈ షేర్ల పరిస్థితి ఇప్పట్లో మార్పు ఉండదనేది కొంతమంది అంచనా.

 

నెక్స్ట్ ఏంటి..?


మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడికి అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయంపై అంచనాలే కారణంగా తెలుస్తోంది. అక్కడి వడ్డీ రేట్లు పెంచితే, ఆ కాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందనే విషయంలో ఇక్కడి ఇన్వెస్టర్లు ఆచితూచి స్పందించడమే ఎంపిక చేసిన కొన్ని సెగ్మెంట్లలో లాభాల స్వీకరణకు కారణమైంది. కొందరు అనలిస్టులు మాత్రం ఇప్పుడిక కరెక్షన్ సమయం వచ్చిందనే ముందస్తు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వరసగా 550 పాయింట్లు పెరిగిన నిఫ్టీకి ఇది అవసరమనేది వారి వాదన. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తర్వాత ఇండియా సహా అనేక మార్కెట్లలో నీ జెర్క్ రియాక్షన్ వస్తుందని డాల్టన్ కేపిటల్‌కి చెందిన UR భట్ కామెంట్ చేయడం ఈ సందర్భంగా గుర్తు పెట్టుకోవాలి


NIFTY US FED HAWKISH RED 15700 CLOSING REPORT TELUGU